News September 20, 2025
కొడంగల్‌లో 15వేల ఓట్ల చోరీ: CM రేవంత్

కొడంగల్ నియోజకవర్గంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 15వేల ఓట్లు చోరీ చేసినట్లు CM రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి పోలింగ్ బూతులో 5 నుంచి 10 శాతం ఓట్లు తొలగించారని తెలిపారు. ఓట్ల చోరీపై నిరసన కూడా వ్యక్తం చేసినట్లు గుర్తుచేశారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి 9,319 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
Similar News
News September 20, 2025
KMR: 46% నేరాల ఛేదన.. 42% సొత్తు రికవరీ

కామారెడ్డి జిల్లా పోలీసులు నేరస్తులను పట్టుకోవడంలో విశేష కృషి చేస్తున్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ‘Chase, Catch, Solve’ కు చెందిన కొత్త పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ ఏడాది జిల్లాలో 46% ఆస్తి సంబంధిత నేరాలను ఛేదించి, 42% చోరీ సొత్తును రికవరీ చేశామని ఎస్పీ తెలిపారు. ఇందులో మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, UPలకు చెందిన 10 అంతరాష్ట్ర గ్యాంగ్‌లను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
News September 20, 2025
ఈనెల 22న మేడారానికి సీఎం రేవంత్

ఈనెల 22న మేడారం పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారయ్యింది. సీఎంవో నుంచి సమాచారం అందుకున్న ములుగు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ దివాకర అధికారులతో అత్యవసర సమావేశానికి ఆదేశించారు. 2026లో జరిగే మేడారం మహా జాతర ఏర్పాట్లు, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే రూ.150కోట్లను మంజూరు చేశారు.
News September 20, 2025
HYD: ఇక్రిశాట్ టోల్‌గేట్ దగ్గర భారీగా గంజాయి పట్టివేత

గంజాయి అక్రమ రవాణాలో స్మగ్లర్లు తెలివి మీరిపోయారు. ఒడిశా నుంచి ముంబైకి 170 కేజీల ఎండు గంజాయిని రవాణా చేస్తోన్న ఇద్దరిని HYD పటాన్‌చెరు పరిధి ఇక్రిశాట్ టోల్‌గేట్ వద్ద మాదాపూర్ SOT పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు దొరకొద్దని 80 ప్యాకెట్లలో గంజాయిని నింపి, హోండా సిటీ కారులో దాచినట్లు గుర్తించారు. గంజాయితోపాటు MH02 BP 4385 నంబర్ గల కారుని సీజ్ చేశామని పోలీస్ అధికారులు తెలిపారు.