News April 4, 2025
కొడంగల్: ‘ఆస్తిపన్ను వసూళ్లలో రికార్డు’

ఆస్తిపన్ను వసూళ్లలో కొడంగల్ మున్సిపాలిటీ రికార్డు సాధించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను 82.88 శాతం పన్ను వసూలు చేసినట్లు కమిషనర్ బలరాం నాయక్ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ టి కె. శ్రీదేవి చేతులమీదగా కమిషనర్ బలరాం నాయక్ ప్రశంస పత్రాన్ని అందుకున్నారు.
Similar News
News April 4, 2025
చిత్తూరు: 11 లోపు అభ్యంతరాలు చెప్పండి

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని జడ్పీ, మున్సిపాలిటీ, నగరపాలక పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీ/లాంగ్వేజ్ పండిట్స్/పీఈటీల స్కూల్ అసిస్టెంట్ పదోన్నతుల సీనియార్టీ జాబితాను డీఈవో వెబ్‌సైట్‌లో పెట్టారు. ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 5వ తేదీ నుంచి 11వ తేదీ లోపు తన కార్యాలయంలో తగిన ఆధారాలతో సమర్పించాలని డీఈవో వరలక్ష్మి చెప్పారు. ఆ తర్వాత అభ్యంతరాలు తీసుకోబోమని స్పష్టం చేశారు.
News April 4, 2025
జర్మనీకి కుంభమేళా పవిత్ర జలాలు

జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగిన మహాకుంభమేళా నుంచి సేకరించిన పవిత్ర గంగా జలాలను యూపీ ప్రభుత్వం విదేశాలకు పంపుతోంది. మొదటగా మహా ప్రసాదం పేరుతో వెయ్యి బాటిళ్లను(ఒక్కోటి 250ml) జర్మనీలోని భక్తులకు ఎగుమతి చేసింది. ఇప్పటికే UPలోని 75 జిల్లాలతోపాటు దేశవ్యాప్తంగా 50వేల బాటిళ్లను సరఫరా చేసినట్లు తెలిపింది. కుంభమేళాకు హాజరుకాలేకపోయిన వారికి జలాలను పంపి ఈ మహావేడుకలో భాగం చేస్తున్నట్లు పేర్కొంది.
News April 4, 2025
మహబూబ్‌నగర్: ఘనంగా వేడుకలు నిర్వహించాలి: బీజేపీ

మహబూబ్‌నగర్‌లోని బీజేపీ జిల్లా ఆఫీస్‌లో జిల్లా స్థాయి ముఖ్యనాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ.. ఈనెల 6 నుంచి 13 వరకు బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, 14 నుంచి 25 వరకు అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలన్నారు. వక్ఫ్ బోర్డు సవరణ, జనగణన, జమిలి ఎన్నికలు, రైతుల సమస్యలపై బూత్ కమిటీలు వేసి చర్చించాలని అన్నారు.