News April 21, 2025
కొడంగల్ కమిషనర్‌కు ప్రమోషన్

కొడంగల్ మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్ గ్రేడ్-3 నుంచి గ్రేడ్-2 కమిషనర్‌గా ప్రమోషన్ పొందారు. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఉత్తర్వులు జారీ చేశారు. కొడంగల్ ప్రజల సహకారంతో మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. 2025 -26 ఆర్థిక సంవత్సరంలో 100 శాతం ఆస్తి పన్ను సాధిస్తామని పేర్కొన్నారు.
Similar News
News April 21, 2025
బాపట్ల: బాధితులకు న్యాయం చేస్తాం- ఎస్పీ

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను పూర్తిస్థాయిలో విచారించి బాధితులకు న్యాయం చేస్తామని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి అన్నారు. సోమవారం బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని చట్ట పరంగా విచారించి చర్యలు చేపడతామన్నారు. పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
News April 21, 2025
రేపు సిట్ విచారణకు రాజ్ కసిరెడ్డి

ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి రేపు సిట్ విచారణకు హాజరుకానున్నారు. ఈమేరకు ఆయన అధికారులకు సమాచారం ఇచ్చారు. రాజ్‌ను విచారించేందుకు సిట్ ఇప్పటికే నాలుగుసార్లు నోటీసులు ఇచ్చింది. అప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. ఈక్రమంలోనే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, విచారణను న్యాయస్థానం వచ్చేవారానికి వాయిదా వేసింది.
News April 21, 2025
పీజీఆర్ఎస్ సమస్యలకు పోలీసు శాఖ కృషి చేస్తుంది: ఎస్పీ

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను సత్వరం పరిష్కరించి బాధితులకు న్యాయం అందేలా చూసేందుకే పోలీసు శాఖ కృషి చేస్తుందని ఎస్పీ ప్రతాప్ సింగ్ కిషోర్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన పీజీఆర్ఎస్ ఫిర్యాదులను ఆయన ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం స్వీకరించారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రతిదారులకు ఉచిత భోజన సదుపాయాన్ని కల్పించారు.