News March 28, 2024
కొడంగల్ నుంచి 50 వేల మెజార్టీ రావాలి: సీఎం

మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానానికి నిర్వహించే ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి 50 వేల మెజార్టీ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకోసం మూడంచెలుగా సమన్వయ కమిటీలు వేసుకొని పని చేయాలని, ఏప్రిల్ 8న కొడంగల్ మళ్లీ వచ్చి సమన్వయ కమిటీ సభ్యులతో ఎంత మెజార్టీ ఇస్తారో రాయించుకుని సంతకాలు తీసుకుంటానన్నారు. ఇవే సమన్వయ కమిటీలు తర్వాత నిర్వహించే ఇందిరమ్మ కమిటీలుగా రూపాంతరం చెందుతాయన్నారు.
Similar News
News April 21, 2025
MBNR: TGSRTCలో జాబ్స్.. ప్రిపరేషన్‌కు READY

TGSRTCలో 3,038 పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రకటించడంతో MBNR,NGKL,WNP,GDWL,NRPTలో నిరుద్యోగులు ప్రిపరేషన్‌కు రెడీ అవుతున్నారు. డ్రైవర్లు-2,000, శ్రామిక్-743, డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానికల్-114, ట్రాఫిక్- 84), DM/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ -25,అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్-18,సివిల్-23, సెక్షన్ ఆఫీసర్-11, అకౌంట్స్ ఆఫీసర్-6,మెడికల్ ఆఫీసర్స్ (జనరల్-7, స్పెషలిస్టు-7) పోస్టులు ఉన్నాయి.
News April 21, 2025
MBNR: ‘విద్యా వ్యవస్థను బలోపితం చేస్తాం’

సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో విద్యావ్యవస్థను బలోపితం చేసి విద్యార్థుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ సభ్యుడు చారకొండ వెంకటేశ్ అన్నారు. బీటీఏ నేత బాల పీరు ఉద్యోగ విరమణ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. విద్యార్థుల, ఉపాధ్యాయుల సమస్యలైన బదిలీలు, ప్రమోషన్స్, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
News April 20, 2025
MBNR: 22ఏళ్ల తర్వాత కలుసుకున్నారు

అడ్డాకుల మండల పరిధిలోని శాఖపూర్‌లో 2002-2003 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు జిల్లా పరిషత్ హై స్కూల్‌లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులు తమ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, గురువులకు మెమెంటోలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు విష్ణువర్ధన్ రెడ్డి, కృష్ణవర్ధన్ గౌడ్, కేశవర్ధన్ గౌడ్, రాజేష్, నరేందర్ తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.