News November 6, 2025
కొడంగల్: నేషనల్ రోడ్ల నిర్మాణానికి సహకరించాలి: కలెక్టర్

మహబూబ్‌నగర్ నుంచి చించోలికి నేషనల్ హైవే నిర్మాణానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో నేషనల్ హైవేలో విలువైన భూములు, కట్టడాలు పోతున్న బాధితులతో కలెక్టర్ అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. నేషనల్ హైవేలో నష్టం జరుగుతున్న బాధితులు సమ్మతిస్తే వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకుంటామన్నారు.
Similar News
News March 6, 2026
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలి: కలెక్టర్

జిల్లాలో సమగ్ర అభివృద్ధి, ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాలు వివిధ విభాగాల సమన్వయంతో నిర్వహించబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమాలలో భాగంగా ప్రతి శాఖకు సంబంధించి నోడల్ విభాగాలు, నోడల్ అధికారులు నియమించబడినట్లు తెలిపారు.
News March 6, 2026
ఆరేళ్ల కష్టం.. అరవై ఏళ్ల సుఖం: SP ధీరజ్

మదనపల్లెలోని ఓ కళాశాలలో జరిగిన మహిళా భద్రత అవగాహన సదస్సులో కలెక్టర్ నిశాంత్ కుమార్, SP ధీరజ్ పాల్గొన్నారు. 16-22 ఏళ్ల వయస్సు జీవితానికి కీలకమని, ఈ ఆరేళ్లు కష్టపడితే భవిష్యత్తు బాగుంటుందని SP సూచించారు. సోషల్ మీడియా మాయలో పడకుండా, అపరిచితులకు ‘నో’ చెప్పడం నేర్చుకోవాలని ఎస్పీ హితవు పలికారు. వేధింపులపై శక్తి టీమ్‌కు ఫిర్యాదు చేయాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.
News March 6, 2026
ఎర్లీ డిన్నర్.. రాత్రి ఆకలేస్తోందా?

హెల్త్ కోసం ఎర్లీగా తింటే పడుకునే టైమ్‌కు ఆకలేసి కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. దీనికి కొన్ని టిప్స్ పాటిస్తే బెటర్. ముందుగా సైకలాజికల్‌గా ఈ టైమ్ తర్వాత తినొద్దని ఫిక్స్ అవ్వాలి. ఆకలేయగానే తినడానికి బదులు నీళ్లు తాగాలి. పాలూ తాగొచ్చు. నట్స్ లాంటి పోషకాలతో కూడిన స్నాక్స్ తక్కువ మోతాదులో తినొచ్చు. జర్నలింగ్, వాకింగ్ వంటి హాబిట్స్‌తో ఆకలిని మరిపించొచ్చు. కొన్నాళ్ల తర్వాత బాడీ అలవాటుపడిపోతుంది.


