News March 19, 2025
కొడంగల్: బాలికపై అత్యాచారం.. నిందితుడి రిమాండ్

యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ సైదులు, ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాలు.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం బల్లునాయక్ తండా వాసి ధనావత్ పవన్ కుమార్(23) NRPT జిల్లా కొడంగల్ పరిధి మద్దూర్ మండలానికి చెందిన 17ఏళ్ల బాలికను ఇన్‌స్టాలో పరిచయం చేసుకుని ప్రేమ పేరుతో మోసగించి, ఆమెపై అత్యాచారం చేశాడు. బాధితురాలి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదవగా ఈరోజు జడ్జి 14 రోజులు రిమాండ్ విధించారు.
Similar News
News March 20, 2025
బడ్జెట్లో ములుగు జిల్లా ప్రజలకు నిరాశే!

తెలంగాణ ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ములుగు జిల్లా ప్రజలకు నిరాశే మిగిల్చింది. జిల్లాలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరైన మేడారం అభివృద్ధికి నిధులు కేటాయించలేదు. కొత్తగా మున్సిపాలిటీగా అవతరించిన ములుగు పట్టణ అభివృద్ధి యాక్షన్ ప్లాన్‌కు బడ్జెట్లో చోటు దక్కలేదు. జిల్లాలోని యువత ఎంతగానో ఎదురు చూస్తున్న ఉపాధి పరిశ్రమల ఏర్పాటుకు నిధులు కేటాయించకపోవడం యువత నిరాశకు లోనయ్యారు.
News March 20, 2025
పన్ను వసూళ్ళలో హుజూరాబాద్‌కు మొదటిస్థానం

ఇంటిపన్ను వసూళ్లలో హుజూరాబాద్ మున్సిపాలిటీ 100 శాతం లక్ష్యాన్ని సాధించి రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచిందని మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తెలిపారు. కమీషనర్ మాట్లాడుతూ.. ఈ ఘనత ప్రజల సహకారంతోనే సాధ్యమైందన్నారు. అధికార్లు, సిబ్బంది ముందు కార్యాచరణ రూపొందించి సమర్థవంతంగా పని చేయటం వల్ల ఈ విజయం సాధించామన్నారు. హుజూరాబాద్ మున్సిపల్ పౌరులకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తామన్నారు.
News March 20, 2025
నిర్మల్: ‘మున్సిపాలిటీల నిధులను సమర్థవంతంగా వాడాలి’

పట్టణాల అభివృద్ధికి కేటాయించిన నిధులను సమర్థవంతంగా వినియోగించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీల్లో వివిధ అభివృద్ధి పనులకు మంజూరైనా నిధులను పారదర్శకంగా వినియోగించాలని సూచించారు. మున్సిపాలిటీల వారీగా కేటాయించిన నిధులు, చేపట్టిన పనులు, ఖర్చు చేసిన, అందుబాటులో ఉన్న నిధులకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.