News March 19, 2025
కొడంగల్: బాలికపై అత్యాచారం.. నిందితుడి రిమాండ్

యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ సైదులు, ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాలు.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం బల్లునాయక్ తండా వాసి ధనావత్ పవన్ కుమార్(23) NRPT జిల్లా కొడంగల్ పరిధి మద్దూర్ మండలానికి చెందిన 17ఏళ్ల బాలికను ఇన్‌స్టాలో పరిచయం చేసుకుని ప్రేమ పేరుతో మోసగించి, ఆమెపై అత్యాచారం చేశాడు. బాధితురాలి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదవగా ఈరోజు జడ్జి 14 రోజులు రిమాండ్ విధించారు.
Similar News
News March 20, 2025
MBNR: రంజాన్ మాసం.. హాలీమ్‌కు సలాం.!

రంజాన్ నెలలో దర్శనమిచ్చే నోరూరించే వంటకం హలీం. ఉపవాసాలుండే ముస్లింలతో పాటు హిందువులు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పటికే ఉమ్మడి MBNR జిల్లా వ్యాప్తంగా పట్టణాల్లో, ఆయా మండలాల కేంద్రాల్లో హలీం సెంటర్లు దర్శనమిస్తున్నాయి. మాంసం, గోధుమలు, పప్పుదినుసులు, నెయ్యి, డ్రైఫ్రూట్స్‌తో కలిపి ఉడికించి తయారు చేస్తారు. చివర్లో వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీరతో గార్నిష్ చేసి ఇస్తారు.మీరు తింటే ఎలా ఉందో కామెంట్ పెట్టండి?
News March 20, 2025
మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు

ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కల్పించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి వైద్యులను ఆదేశించారు. బుధవారం మూసాపేట మండల పరిధిలోని జానంపేట పీ.హెచ్.సీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగుల వైద్య చికిత్సను పరిశీలించి సమస్యలపై రోగులని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నందున, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కలెక్టర్ ఆదేశించారు.
News March 20, 2025
మహబూబ్‌నగర్: 144 సెక్షన్ అమలు: ఎస్పీ

మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో జరిగే పదో తరగతి పరీక్షల నేపథ్యంలో కేంద్రాల వద్ద మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు సెక్షన్ 163 BNSS యాక్ట్-2023 (144 సెక్షన్) అమలులో ఉంటుందని ఎస్పీ డి.జానకి బుధవారం తెలిపారు. 12,769 మంది విద్యార్థులకు 60 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండొద్దని సూచించారు.