News February 12, 2025
కొడంగల్: బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన సీఎం రేవంత్

దుద్యాల మండలంలోని పోలేపల్లి శ్రీరేణుక ఎల్లమ్మ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పోస్టర్ ను సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ నెల 20 నుంచి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 21న ప్రధాన ఘట్టం సిడె కార్యక్రమానికి సీఎం హాజరు కానున్నారని ఆలయ మేనేజర్ రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ జయరాములు, నాయకులు మెరుగు వెంకటయ్య, సీసీ వెంకటయ్యగౌడ్, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Similar News
News January 3, 2026
MDLలో 200 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్(MDL)లో 200 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే (JAN 5)ఆఖరు తేదీ. BE/బీటెక్, డిప్లొమా, డిగ్రీ(B.COM, BCA, BBA, BSW) ఉత్తీర్ణులు అర్హులు. 18 నుంచి 27ఏళ్లు కలిగి ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అర్హతగల అభ్యర్థులు NATS పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్:mazagondock.in/
News January 3, 2026
బిడ్డకు ఎలాంటి సమస్యలొస్తాయంటే?

డెలివరీ డేట్ దాటినా నొప్పులు రాకపోతే వైద్యుల పర్యవేక్షణలో ఉండటం మంచిదంటున్నారు నిపుణులు. దీనివల్ల ఉమ్మనీరు తగ్గడం, బిడ్డకు తగినంత ఆక్సిజన్ అందకపోవడం, శిశువు విసర్జితాలు తిరిగి శిశువులోకి చేరడం వంటి సమస్యలు వస్తాయి. ఇవి కొన్నిసార్లు బిడ్డకు ప్రాణాంతకం కావొచ్చంటున్నారు. కాబట్టి డెలివరీ డేట్ దగ్గరకు వచ్చినప్పటి నుంచి వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటూ బిడ్డ ఆరోగ్యాన్ని సంరక్షించాలని చెబుతున్నారు.
News January 3, 2026
అమ్మాయిలు నల్లదారం కట్టుకుంటున్నారా?

నలుపు శనిదేవునికి ప్రతీక. చెడు దృష్టి నుంచి రక్షణ కోసం, ప్రతికూల శక్తులను దూరం చేసేందుకు మహిళలు తమ ఎడమ కాలికి నల్లదారం కట్టుకోవాలి. ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు తొలగి, శని దోషాలు పోతాయని నమ్మకం. శనివారం నాడు శనిదేవుడిని ప్రార్థించి, మంత్రం పఠిస్తూ దారం ధరిస్తే మంచి జరుగుతుందట. దారం బిగుతుగా లేదా వదులుగా ఉండకూడదట. సరైన పద్ధతిలో కట్టుకుంటేనే ఆరోగ్య సమస్యలు దూరమై, అదృష్టం వరిస్తుందని భక్తుల విశ్వాసం.


