News March 27, 2025

కొడంగల్: భూమి పూజ చేసిన సీఎం సోదరుడు

image

కొడంగల్ పరిధి మద్దూరు మున్సిపాలిటీ పరిధిలోని రెనివట్ల గ్రామంలో గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతిరెడ్డి భూమి పూజా కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్‌తో పాటు, కడా ఛైర్మన్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Similar News

News March 30, 2025

ప్రార్థన స్థలాల వద్ద పటిష్ట బందోబస్తు: బాపట్ల ఎస్పీ

image

రంజాన్ పండగ పురస్కరించుకొని ముస్లింలు ప్రార్థనలు నిర్వహించే స్థలాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. ఎక్కడైనా అల్లర్లకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కులమత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు.

News March 30, 2025

కోల్‌కతా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్

image

కేకేఆర్ ఫ్యాన్స్‌కు ఆ జట్టు కోచ్ చంద్రకాంత్ పండిట్ గుడ్ న్యూస్ చెప్పారు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అనారోగ్యం కారణంగా ఆడని సునీల్ నరైన్ కోలుకున్నారని ఆయన తెలిపారు. రేపు వాంఖడేలో ముంబైతో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటారని వెల్లడించారు. కాగా.. RRతో మ్యాచ్‌లో నరైన్ స్థానంలో ఆడిన మొయిన్ అలీ 2 వికెట్లు తీశారు.

News March 30, 2025

బైక్ ఎక్స్‌పెడిషన్ బృందానికి స్వాగతం

image

250వ AOC కార్పస్ డేను పురస్కరించుకుని బయలుదేరిన బైక్ ఎక్స్‌పెడిషన్ బృందాన్ని CAD పులగాన్ వద్ద ఉత్సాహంగా స్వాగతించారు. ఈ బృందం సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వరకు 2200 కి.మీ ప్రయాణించి మార్గమధ్యలో వీర నారులు, వేటరన్లు, విద్యార్థులతో పరస్పర కలయిక సాధించనుంది. ఆ తర్వాత వీరిని అధికారికంగా ఫ్లాగ్ ఆఫ్ చేశారు.

error: Content is protected !!