News September 24, 2025
కొడంగల్: రోడ్డు వేసిన రెండు నెలల్లోనే కొట్టుకుపోయింది: కేటీఆర్

కొడంగల్: సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కొత్తగా వేసిన రోడ్డు ఒక్క భారీ వర్షంతో కొట్టుకుపోయింది. బొంరాస్‌పేట మండలం బాపల్లి నుంచి దౌల్తాబాద్ మండలం నందారం వరకు 13 కి.మీకి రూ.30 కోట్లు కేటాయించి నిర్మించిన రోడ్డు దెబ్బతింది. మంచి రోడ్డు కూడా నిర్మించలేని ప్రభుత్వం కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టుల్లో చిన్న లోపాన్ని ప్రశ్నించడం విడ్డూరమని తన X ఖాతాలో KTR ఆరోపించారు.
Similar News
News September 24, 2025
ఆసియా కప్: గెలిస్తే ఫైనల్‌కే

ఆసియాకప్ 2025 సూపర్-4లో భాగంగా నేడు బంగ్లాదేశ్‌తో టీమ్‌ఇండియా తలపడనుంది. ఈ మ్యాచులో గెలిస్తే సూర్య సేన ఫైనల్ చేరనుంది. ఒకవేళ ఓడితే శ్రీలంకతో మ్యాచులో మెరుగైన RRతో గెలవాలి. బంగ్లాతో ఇప్పటివరకు 17 T20Iలు ఆడగా 16 మ్యాచుల్లో IND విజయం సాధించింది. అటు శ్రీలంకపై విజయంతో బంగ్లా జోరు మీద ఉంది. దుబాయ్ వేదికగా రా.8 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్ ఛానల్, సోనీ లివ్ యాప్‌లో లైవ్ చూడవచ్చు.
News September 24, 2025
టన్ను ఇసుక రూ. 1,100 కే విక్రయం: కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరలో ఇసుక అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇసుక బజార్లను ఏర్పాటు చేసిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. గోదావరి ఇసుకను టన్నుకు రూ. 1,100 చొప్పున విక్రయిస్తున్నట్లు ఆయన చెప్పారు. కూసుమంచి, మధిర, సత్తుపల్లి, కామేపల్లి, ఖమ్మంలో ఈ ఇసుక బజార్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ ఐదు బజార్లలో మొత్తం 5,194 మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులో ఉంచామని తెలిపారు.
News September 24, 2025
బొప్పాయి, ఫైనాపిల్ గర్భిణులు తినకూడదా?

గర్భిణులు బొప్పాయి, పైనాపిల్ తింటే గర్భస్రావం జరుగుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకే వాటికి దూరంగా ఉండాలంటుంటారు. అయితే ఇందులో వాస్తవం లేదని గైనకాలజిస్టులు చెబుతున్నారు. గర్భిణులు బాగా పండిన బొప్పాయి, పైనాపిల్ తినడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేస్తున్నారు. అపోహలను పక్కనపెట్టాలని సూచిస్తున్నారు. పచ్చి బొప్పాయి, పచ్చి పైనాపిల్ ఎక్కువగా తింటే మాత్రమే సమస్య ఉంటుందంటున్నారు.
#ShareIt