News October 3, 2025
కొడంగల్: వక్ఫ్ బోర్డు మెంబర్ నివాసంలో సీఎం

సీఎం రేవంత్ రెడ్డి విజయదశమి పండుగను పురస్కరించుకొని శుక్రవారం కొడంగల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, వక్ఫ్ బోర్డు మెంబర్ యూసుఫ్ నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు సీఎం హాజరయ్యారు. అక్కడున్న వారిని ఆప్యాయంగా పలకరించారు. సీఎంతో పాటు ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, స్థానికులు ముస్తాక్, బషీర్, ఆసిఫ్‌ఖాన్ ఉన్నారు.
Similar News
News October 3, 2025
తణుకు: సురేశ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి.. హత్యగా కేసుగా మార్పు

అనుమానాస్పద స్థితిలో అదృశ్యమై హత్యకు గురైన మడుగుల సురేష్ మృతదేహానికి పోస్టుమార్టం శుక్రవారం పూర్తి చేశారు. తణుకులో న్యాయవాది తిర్రే సత్యనారాయణరాజుతో పాటు మరో నలుగురు చేతిలో హతమైనట్లుగా పోలీసులు భావిస్తున్న సురేష్ మృతదేహాన్ని సఖినేటిపల్లి గోదావరి తీరంలో గురువారం గుర్తించిన విషయం తెలిసిందే. శుక్రవారం రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి చేసి హత్య కేసుగా మార్పు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News October 3, 2025
ప్రొద్దుటూరు డిపోలో రూ.64.84 కోట్ల మద్యం అమ్మకాలు

ప్రొద్దుటూరు మద్యం డిపోలో గత నెలలో రూ.64,84,23,961 మద్యాన్ని విక్రయించారు. 90,917 కేసుల మద్యం(IML), 41,051 కేసుల బీర్లను విక్రయించారు. ప్రొద్దుటూరులో రూ.17,38,10,481, బద్వేల్‌లో రూ.10,19,74,024లు, జమ్మలమడుగులో రూ.6,44,49,207, ముద్దనూరులో రూ.3,65,34,335లు, మైదుకూరులో రూ.8,69,16,893, పులివెందులలో రూ.11,27,65, 246, ఎర్రగుంట్లలో రూ.7,19,73,773 మద్యం కొనుగోలు జరిగింది.
News October 3, 2025
కనిగిరి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్

కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 3 నెలలపాటు నిరుద్యోగ యువతీ, యువకులకు అసిస్టెంట్ ఎలక్ట్రిషన్, జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ అవకాశాన్ని 17- 45 ఏళ్లవారు వినియోగించుకోవాలని ప్రిన్సిపాల్ ఉషారాణి తెలిపారు. సాఫ్ట్వేర్ డెవలపింగ్‌లో రూ.లక్ష వరకు జీతాలు ఉంటాయన్నారు. వివరాలకు 8008822821 నంబర్‌ను సంప్రదించాలన్నారు.