News March 24, 2025
కొడంగల్: విషాదం.. యువకుడి మృతి!

యువకుడు ఆత్మహత్యకు యత్నించగా చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన కొడంగల్ పరిధి మద్దూరులో జరిగింది. ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాలు.. మండలంలోని గోకుల్ నగర్ వాసి సాయిలు(21) ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఈ విషయంపై తండ్రి మందలించాడని ఈనెల 17న గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబీకులు చికిత్స నిమిత్తం అతడిని హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడని మద్దూర్ ఎస్ఐ తెలిపారు.
Similar News
News March 26, 2025
MBNR: గ్లోబల్ బిజినెస్ అవార్డు అందుకున్న పాలమూరు వాసులు

మహబూబ్నగర్‌కి చెందిన జి.నారాయణ రెడ్డి, కాసోజు జగదీశ్ HYDలో నిర్వహించిన గ్రేట్ ఇండియన్ ట్యాక్స్ పేయర్స్ అవార్డ్స్ కార్యక్రమంలో గ్లోబల్ బిజినెస్ నెట్‌వర్క్ ఛైర్మన్ కడారి శ్రీధర్ ఆధ్వర్యంలో గ్లోబల్ బిజినెస్ అవార్డు అందుకున్నారు. వ్యాపార రంగంలో విశేష విజయాలు సాధించిన వ్యక్తులకు గ్లోబల్ బిజినెస్ అవార్డులు అందజేశారు. జి.నారాయణ రెడ్డి, కాసోజు జగదీశ్ హెల్త్&టర్మ్ ఇన్సూరెన్స్ రంగంలో సేవలు అందిస్తున్నారు.
News March 26, 2025
నేషనల్ కబడ్డీ పోటీలకు MBNR జిల్లావాసి ఎంపిక

34వ నేషనల్ సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం తిమ్మాయిపల్లి తండాకు చెందిన జై సురేశ్ ఎంపికయ్యారు. ఈనెల 27వ తేదీ నుంచి 31 తేదీ వరకు బిహార్‌లోని గయాలో నిర్వహించనున్న పోటీలలో సురేష్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శాంతికుమార్, జనరల్ సెక్రెటరీ కురుమూర్తి గౌడ్, ఉపాధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, దామోదర్ రెడ్డి తదితరులు సురేశ్‌ను అభినందించారు.
News March 26, 2025
MBNR: 1052 మంది రక్తదానం చేశారు: నటరాజు

షహీద్ దివస్‌ను పురస్కరించుకుని మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా వివిధ సంస్థలు, కళాశాలలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాల్లో మొత్తం 1052 మంది యువత రక్తదానం చేశారని ఐఆర్‌సీఎస్ ఛైర్మన్ నటరాజు ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈ నెల 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రక్తదాన శిబిరాలను నిర్వహించగా.. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారని తెలిపారు.