News February 12, 2025
కొడంగల్: సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ శ్రీసేవాలాల్ జయంతి ఉత్సవాల ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొడంగల్ కమిటీ అధ్యక్షుడు శివ చౌహాన్, జనరల్ సెక్రటరీ శంకర్ నాయక్ అందజేశారు. ఈనెల 15న జరిగే ఉత్సవాలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించినట్లు వారు తెలిపారు. బంజారా నాయకులు రెడ్య నాయక్, సంతోష్, రవి నాయక్, రామచందర్, భాను నాయక్ ఉన్నారు.
Similar News
News November 8, 2025
సిరిసిల్ల: ‘న్యాయ సేవాధికార సంస్థను వినియోగించుకోవాలి’

ఉచిత న్యాయ సహాయం కోసం న్యాయ సేవాధికార సంస్థను వినియోగించుకోవాలని, సమస్యలను శాంతియుతంగా, త్వరితంగా పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్ అన్నారు. న్యాయ సేవల దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం సిరిసిల్ల పట్టణంలోని లహరి గ్రాండ్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.
News November 8, 2025
మేడారం భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: జిల్లా కలెక్టర్

మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర అన్నారు. జాతరలో వైద్యశాఖ ముందస్తు ప్రణాళికపై జిల్లా కాన్ఫరెన్స్ హాల్‌లో డీఎంహెచ్‌వోతో కలిసి సమీక్ష జరిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. అవసరమైన పరికరాలు, బెడ్స్‌ను సమకూర్చుకోవాలన్నారు. అత్యవసర సేవల కోసం 108 ప్రభుత్వ వాహనాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
News November 8, 2025
సిరిసిల్ల: ‘నిబంధనలకు అనుగుణంగా సీఎంఆర్ సరఫరా చేయాలి’

రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రైస్ మిల్లర్లు సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్)ను సరఫరా చేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గడ్డం నగేష్ ఆదేశించారు. సీఎంఆర్ సరఫరా, ఖరీఫ్ ధాన్యం కేటాయింపు, బ్యాంక్ గ్యారెంటీ వంటి అంశాలపై ఆయన శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో రా రైస్ మిల్లర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేటాయించిన ధాన్యం, ఎఫ్‌సీఐకి ఇచ్చిన బియ్యం వివరాలు సమర్పించాలని ఆయన ఆదేశించారు.


