News May 24, 2024
కొడవలూరులో అగ్ని ప్రమాదం

కొడవలూరు మండలం గండవరం గౌతమ్ నగర్‌లో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గ్రామంలోని ఓ రైతుకు చెందిన గడ్డివాము కాలిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు 50 వేల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపాడు. ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Similar News
News January 11, 2026
నెల్లూరు సెంట్రల్ జైల్ నుంచి ఖైదీ పరార్

నెల్లూరు సెంటర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ పరారయ్యాడు. బాపట్ల జిల్లా భట్టిప్రోలు గ్రామానికి చెందిన షేక్ చిన్న సైదులు 2022 సంవత్సరంలో తన భార్యను హత్య చేసి శిక్షను అనుభవిస్తున్నాడు. రెండు సంవత్సరాలు రాజమండ్రి జైలులో శిక్షణ అనుభవించి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఖైదీ సైదులు సత్ప్రవర్తన కింద ఓపెన్ జైలుకు తరలించారు. వ్యవసాయ పనులు చేస్తూ పరారయ్యాడు.
News January 11, 2026
నెల్లూరు: త్వరలో మూడు చోట్ల ఇసుక రీచ్‌లు.?

పెన్నా పరీవాహక ప్రాంతంలో మరో 3 చోట్ల కొత్త ఇసుక రీచ్‌లు రానున్నాయట. ఇప్పటికే పొట్టేపాలెం, సంగం, సూరాయాపాలెం వద్ద పాయింట్లు ఉండగా విరువూరు వద్ద ఓపెన్ రీచ్ ఉంది. వీటితోపాటు మైన్స్ అధికారులు చేజర్ల మండల పరిధిలో మాముడూరు, కోటితీర్ధం, నెల్లూరు రూరల్లో ములుముడి ప్రాంతాల్లో కొత్తగా రీచ్‌లు ఓపెన్ చేసేందుకు కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. లేగుంటపాడులోనూ రీచ్ కోసం అధికారులు పరిశీంచారు.