News October 5, 2025
కొడాలి నాని భవిష్యత్తు రాజకీయాలపై ఉత్కంఠ.!

మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని 2024 ఎన్నికల ఓటమి అనంతరం దాదాపు సంవత్సరం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అనారోగ్యం, కేసు నమోదు వంటి కారణాలతో ఆయన గుడివాడకు వచ్చారు. అప్పటి నుంచి ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్న నాని భవిష్యత్తు రాజకీయాలపై వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో ఆసక్తి నెలకొంది. గతంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన తదుపరి రాజకీయ అడుగులు ఎలా ఉండబోతున్నాయనే దానిపై ఈ ఉత్కంఠ కొనసాగుతోంది.
Similar News
News October 5, 2025
SRSP UPDATE: 11 గేట్ల మూసివేత

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టింది. 11 గేట్లు మూసివేసి 26 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. ఆదివారం రాత్రి ఔట్ ఫ్లోగా 1,09,790 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 1,090.9 (80.053 TMC) అడుగుల నీటి మట్టం ఉన్నట్లు పేర్కొన్నారు.
News October 5, 2025
మెదక్: మద్యం దుకాణాలకు 6 దరఖాస్తులు

జిల్లాలో మద్యం దుకాణాలకు ఆరు దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మెదక్ పరిధి పోతంశెట్టిపల్లి (15వ దుకాణం) 3 దరఖాస్తులు, పాపన్నపేట (10) ఒక దరఖాస్తు, రామాయంపేట పరిధి మాసాయిపేట (42) ఒకటి, నార్సింగి (43) ఒక దరఖాస్తురాగా మొత్తం 6 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. ఈనెల 18 వరకు పని దినాలలో ఉ.10 గంటల నుంచి సా.5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు.
News October 5, 2025
కలెక్షన్లలో పవన్ కళ్యాణ్ ‘OG’ సెన్సేషన్

పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘OG’ థియేటర్లలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ ఏడాది అత్యధిక గ్రాస్ వసూలు చేసిన తెలుగు చిత్రంగా నిలిచిందని మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. దీంతో ‘సంక్రాంతికి వస్తున్నాం’(రూ.300+ కోట్లు) రికార్డును బ్రేక్ చేసినట్లు అయింది. ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా ఇమ్రాన్ హష్మీ, ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషించారు.