News May 23, 2024

కొడిమ్యాల: ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేయాలి: అడిషనల్ కలెక్టర్

image

ధాన్యం కొనుగోళ్లను 2, 3 రోజుల్లో పూర్తిచేయాలని అడిషనల్ కలెక్టర్ రాంబాబు అధికారులను ఆదేశించారు. కొడిమ్యాల మండలంలోని పలు కొనుగోలు కేంద్రాలను గురువారం ఆయన పరిశీలించారు. అకాల వర్షాల వలన నష్టపోయిన పంట వివరాలను తెలుసుకున్నారు. రైస్ మిల్లు లను సందర్శించి వెంటనే ధాన్యాన్ని అన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట పలువురు అధికారులు ఉన్నారు.

Similar News

News October 1, 2024

జగిత్యాల జిల్లా DSC టాపర్‌గా జిందం అజయ్‌కుమార్

image

నిన్న విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో కోరుట్లకు చెందిన జిందం అజయ్‌కుమార్ జిల్లా మొదటి ర్యాంకు సాధించాడు. స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ విభాగంలో 80.3 మార్కులతో జగిత్యాల జిల్లా టాపర్‌గా నిలిచాడు. దీంతో ఆయన్ను బంధుమిత్రులు, స్నేహితులు అభినందిస్తున్నారు.

News October 1, 2024

దొంగతనాల నివారణకు ఒక స్పెషల్ టీం: జగిత్యాల ఎస్పీ

image

జగిత్యాల జిల్లాలోని దొంగతనాల నివారణకు ప్రతి సర్కిల్ పరిధిలో ఒక స్పెషల్ టీం నియమించి వాటిని నివారణకు కృషి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. అంతేకాకుండా ప్రాసిక్యూషన్‌లో భాగంగా కోర్టు వారు జారీ చేసిన నాన్‌బెయిలబుల్ వారెంట్లను నిందితుడిపై లేదా తప్పించుకుని తిరుగుతున్న నేరస్తులపై అమలుచేయడానికి అధికారులు అందరూ కృషి చేయాలని సూచించారు.

News October 1, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కరీంనగర్ జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క.
@ హుజురాబాద్‌లో డెంగ్యూతో బాలిక మృతి.
@ ముస్తాబాద్ మండలంలో స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి.
@ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రేపటినుండి డీఎస్సీ అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్.
@ జాతీయ కరాటే పోటీలలో సత్తా చాటిన మెట్పల్లి విద్యార్థులు.
@ చందుర్తి మండలంలో ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య.