News February 3, 2025
కొడుకులు తరిమేశారు: వృద్ధ దంపతులు
కన్న కొడుకులు ఆస్తి రాయించుకుని తరిమేశారని డోన్ పట్టణానికి చెందిన వృద్ధ దంపతులు గంగిరెడ్డి, సుబ్బరత్నమ్మ వాపోయారు. తాము కష్టబడి సంపాదించిన ఇల్లు, ఆస్తులన్నింటినీ కుమారులు స్వాధీనం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని, పత్తికొండలోని శారదా వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నామని తెలిపారు. తమకు న్యాయం కావాలని కోరుతూ డోన్ డీఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.
Similar News
News February 3, 2025
నిధులు కేటాయించండి: పనగరియాకు చంద్రబాబు విజ్ఞప్తి
ఢిల్లీ పర్యటనలో భాగంగా 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అర్వింద్ పనగరియాను ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి పయ్యావుల కేశవ్ కలిశారు. రాష్ట్రానికి కేటాయించే ఆర్థిక సంఘం నిధుల అంశంపై ఆయనతో చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించిన సీఎం, నిధుల కేటాయింపులో పెద్ద మనస్సు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని ఛిన్నాభిన్నం చేసిందని పనగరియా వద్ద నేతలు ప్రస్తావించారు.
News February 3, 2025
సోన్: విద్యుత్ షాక్‌తో ఒకరి మృతి
ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఒకరు మృతి చెందిన ఘటన సోన్ మండలంలో జరిగింది. స్థానిక ఎస్ఐ గోపి తెలిపిన వివరాల ప్రకారం.. పాక్‌పట్ల గ్రామానికి చెందిన నరసయ్య (48) తన పంట చేనుకు నీరు పెట్టడానికి సోమవారం ఉదయం వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై తెలిపారు.
News February 3, 2025
ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలు సైలెంట్.. ఎందుకు?
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నేతలు సైలెంట్ అయ్యారు. క్యాడర్‌కు ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు అందుబాటులో ఉండడం లేదని టాక్. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నా నేతలు కనిపించడం లేదు. దీంతో ఎన్నికల్లో ప్రజల వద్దకు ఎలా వెళ్లాలి.. ఎలాంటి హామీలు ఇవ్వాలో తెలియక లోకల్ లీడర్స్ ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.