News September 10, 2025

కొడుకు పెళ్లికి ముహూర్తం కోసం వెళ్లి ప్రమాదంలో మృతి

image

కంచికచర్ల మండలం గని ఆత్కూరు గ్రామానికి చెందిన శ్రీనివాసరావు, రజినీ దంపతులు <<17658398>>ఘోర రోడ్డు ప్రమాదంలో<<>> మృతి చెందిన విషయం తెలిసిందే. వారి కుమారుడు హైదరాబాద్‌లో సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి వివాహం కుదిరింది. మూహూర్తం కోసం ఖమ్మం (D) తక్కెళ్లపాడు వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.

Similar News

News September 10, 2025

MHBD: ‘చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకోవాలి’

image

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భూమికోసం, భుక్తి కోసం వీర నారి చాకలి ఐలమ్మ చేసిన పోరాటాలు మరువలేనివన్నారు. మహిళలు చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకోని ముందుకు నడవాలన్నారు.

News September 10, 2025

కొవ్వూరులో కుళ్లిన మృతదేహం లభ్యం

image

కొవ్వూరులోని వైఎస్టీడీ మాల్ సమీపంలోని ఓ భవనంపై గుర్తుతెలియని వ్యక్తి కుళ్ళిన మృతదేహం లభ్యమైంది. దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 10, 2025

మహాలయ పక్షాల్లో ఏం చేయాలి?

image

మహాలయ పక్షము పితృదేవతలను స్మరించుకునే పవిత్ర సమయం. ఈ పదిహేను రోజులు గతించినవారి ఆత్మశాంతి కోసం తర్పణాలు, శ్రాద్ధ కర్మలు ఆచరించాలి. ఇది తరతరాల అనుబంధాన్ని, కృతజ్ఞతను చాటుకునే ఆధ్యాత్మిక విధిని సూచిస్తుంది. ఈ సమయంలో చేసే పిండ ప్రదానాలు, అన్నదానాలు పితృదేవతలకు సద్గతిని ప్రసాదిస్తాయి. మనకు వారి ఆశీర్వాదాలు లభించేలా చేస్తాయి. ఈ కర్మలు మనల్ని మన మూలాలకు మరింత దగ్గర చేస్తాయి.