News November 18, 2024

కొణ‌తం దిలీప్ అరెస్టు.. తీవ్రంగా ఖండించిన హ‌రీశ్‌రావు

image

తెలంగాణ మాజీ డిజిటల్ డైరెక్ట‌ర్ కొణతం దిలీప్‌ను పోలీసులు మ‌ళ్లీ అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు విచారణ నిమిత్తం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన దిలీప్ కొణతంను అరెస్టు చేసిన పోలీసులు తెలిపారు. కొణతం దిలీప్ అరెస్టును హ‌రీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత, ప్రతీకార చర్యలను మానుకోవాలని అన్నారు.  దిలీప్‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేస్తున్నామ‌న్నారు.

Similar News

News December 24, 2025

MDK: క్రిస్మస్‌ను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలి: కలెక్టర్

image

యేసుక్రీస్తు జన్మదినోత్సవమైన క్రిస్మస్ పర్వదినాన్ని ప్రతి ఒక్కరు ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రేమ, కరుణ, క్షమ, త్యాగం, శాంతియుత సహజీవనం వంటి విలువలను యేసుక్రీస్తు ప్రపంచానికి బోధించారని పేర్కొన్నారు. ఈ సందేశాన్ని ఆచరణలో పెట్టాలని కోరుతూ జిల్లా ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

News December 24, 2025

MDK: క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

image

క్రిస్మస్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పాపులను సైతం క్షమించమనే త్యాగశీలత, ఓర్పు, సహనం, అహింసా శాంతి మార్గాన్ని యేసు క్రీస్తు మానవ సమాజానికి చూపించారని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో క్రిస్టియన్ మైనారిటీలకు దేశానికే ఆదర్శంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశామని గుర్తు చేశారు.

News December 24, 2025

మెదక్‌: చర్చిల ఫీస్ట్‌ వేడుకలకు నిధులు మంజూరు

image

క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని మెదక్‌ జిల్లాలోని చర్చిల్లో ఫీస్ట్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.34 లక్షలు మంజూరు చేసినట్లు కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ తెలిపారు. మెదక్‌, నర్సాపూర్‌ నియోజకవర్గాలకు ఒక్కో నియోజకవర్గానికి రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.4 లక్షలు కేటాయించగా, రెండు నియోజకవర్గాల్లోని 100 చర్చిలకు ఒక్కో చర్చికి రూ.30 వేల చొప్పున రూ.30 లక్షలు మంజూరు చేసిందన్నారు.