News February 7, 2025

కొణిజర్ల: కాల్వలో ట్రాక్టర్ బోల్తా.. రైతు మృతి

image

ప్రమాదవశాత్తు సాగర్ కాల్వలో ట్రాక్టర్ బోల్తా పడి రైతు మృతి చెందిన ఘటన గురువారం కొణిజర్ల మండలంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం..పెద్దగోపతికి చెందిన తడికమళ్ల రవి తన మిత్రులతో కలిసి మొక్కజొన్న పంటకు నీరు కట్టేందుకు ట్రాక్టర్‌పై జనరేటర్ తీసుకుని బయలుదేరాడు. రాపల్లె మేజర్ కాల్వ మీదుగా వెళ్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కాల్వలో పడింది. రవిపై ఇంజిన్ తిరగబడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

Similar News

News December 24, 2025

సాగర్ కాలువలో విషాదం.. ఒక విద్యార్థి మృతదేహం లభ్యం

image

ఖమ్మం: సాగర్ కాలువలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తూ కొట్టుకుపోయిన ఇద్దరు విద్యార్థులలో ఒకరి ఆచూకీ దొరికింది. కొద్దిసేపటి క్రితం గాలింపు చర్యల్లో భాగంగా అబ్దుల్ సుహాన్ మృతదేహం లభ్యమైంది. మరో విద్యార్థి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 24, 2025

అధికారుల నిర్లక్ష్యం సహించం.. ప్రజా సంక్షేమమే లక్ష్యం: Dy.CM

image

అధికారుల నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజా ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతి సంక్షేమ, అభివృద్ధి పథకం అనుకున్న లబ్ధిదారుడికి చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నామని పేర్కొన్నారు.

News December 24, 2025

ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలి: భట్టి

image

రెవెన్యూ సేవల్లో నాణ్యతను మరింత మెరుగుపరచాలని, ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని Dy.Cm భట్టి విక్రమార్క రెవెన్యూ ఉద్యోగులకు సూచించారు. ఇటీవల ఎన్నికైన తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా యూనిట్‌ నూతన పాలకవర్గ సభ్యులు బుధవారం Dy.Cm ను కలిశారు. ప్రజల సమస్యల పరిష్కారంలో రెవెన్యూ యంత్రాంగం కీలక పాత్ర పోషించాలని సూచించారు.