News March 23, 2025

కొణిదెల గ్రామానికి రూ.50 లక్షలు: పవన్ కళ్యాణ్

image

నందికొట్కూరు మండలంలోని కొణిదెల గ్రామాభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూ.50 లక్షలు ప్రకటించారు. పూడిచర్లలో ఫారమ్ పాండ్స్‌కు శంకుస్థాపన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. తన సొంత ట్రస్టు నుంచి నిధులను కేటాయించారు. ఎమ్మెల్యేతో మాట్లాడి కొణిదెల గ్రామానికి ఏం అవసరమో అవన్నీ చేస్తానని, ప్రభుత్వ పథకాలన్నీ ఈ ఊరి ప్రజలకు అందేలా చూస్తానని పవన్ హామీ ఇచ్చారు. కాగా, పవన్ కళ్యాణ్ ఇంటి పేరు కొణిదెల అని తెలిసిందే.

Similar News

News March 25, 2025

జియో మైసూర్ కంపెనీ గోల్డ్ మెన్స్ సౌత్ ఆఫ్రికా టీమ్స్ సర్వే

image

తుగ్గలి మండలం జొన్నగిరి పరిసర ప్రాంతాలలో జియో మైసూర్ కంపెనీ నిర్వహిస్తున్న గోల్డ్ మైన్స్‌ను సౌత్ ఆఫ్రికా మైనింగ్ నిపుణులు సోమవారం సర్వే చేసినట్లు పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి క్రాంతి నాయుడు తెలిపారు. సీఎస్‌ఆర్ పనులు, పర్యావరణ సమస్యలు, ఉద్యోగ అవకాశాలు, ల్యాండ్ లీజ్, స్కిల్ డెవలప్మెంట్ గురించి మైనింగ్ నిపుణులు చర్చించారని ఆయన తెలిపారు. 

News March 24, 2025

ఏపీపీఎస్సీ పరీక్షలకు పగడ్బందిగా ఏర్పాట్లు చేయండి: జేసీ

image

ఈ నెల 25 నుంచి 27 తేదీ వరకు జిల్లాలో జరిగే ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణకు పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఏపీపీఎస్సీ పరీక్షలపై జేసీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల్లోకి ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు.

News March 24, 2025

కర్నూలు జిల్లాలో TODAY TOP NWS 

image

➤ డబుల్ సెంచరీతో చెలరేగిన రుత్విక్ కళ్యాణ్
➤ కర్నూలులో టీడీపీ నేత హత్య.. నిందితుడి భార్య అరెస్ట్
➤ ఆదోని పరిధిలో 20అడుగుల అతిపెద్ద పాము
➤ కోడుమూరులో దారుణం.. విద్యార్థిని చితకబాదిన సీనియర్
➤ కర్నూలు మేయర్ పీఠంపై టీడీపీ కన్ను
➤ పెద్దకడబూరు: కాలువలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్
➤ కోడుమూరు ఘటన.. వార్డెన్ ను సస్పెండ్ చేసిన కలెక్టర్
➤ క్షయ వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి: జేసి

error: Content is protected !!