News January 16, 2026

కొత్తకొండ వీరభద్ర స్వామి జాతరలో ఉద్రిక్తత!

image

భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామి జాతరలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. క్యూలైన్‌లో ఇద్దరు భక్తుల మధ్య తోపులాట జరిగింది. దీంతో అడ్డుకోబోయిన పోలీసులపై యువకుడు దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం. పోలీసులు, భక్తుల మధ్య వాగ్వాదం జరగడంతో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 10, 2026

HYD: నిరసనలు.. ఆందోళనలతో గడిచిపోయింది!

image

నేటితో ముగియనున్న GHMC పాలక మండలి.. నిరసనలు, ఆందోళనలతోనే గడిచిపోయింది. ఐదేళ్ల పదవీ కాలంలో పాలకమండలి 23సార్లు సమావేశమైంది. ఏడాదికి సరాసరి 4.6 సార్లు జరిగినట్లు లెక్క. ఈ సమావేశాలు జరుగుతున్నపుడు ప్రతిపక్ష పార్టీల సభ్యుల ఆందోళనలు, నిరసనలు హోరెత్తాయి. దీంతో సగం సమావేశాలు వాటితోనే ముగిశాయి. ఈ 5ఏళ్లలో 415 తీర్మానాలను పాలకమండలి ఆమోదించింది.

News February 10, 2026

భువనగిరి: అన్న BRS.. తమ్ముడు కాంగ్రెస్..!

image

భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు ప్రత్యర్థులుగా పోటీ పడుతున్నారు. పాల్త్య హనుమంతు గతంలో ఎంపీటీసీగా పనిచేసిన అనుభవంతో BRS తరఫున బరిలో ఉన్నారు. పాల్త్య వెంకటేశ్(తమ్ముడు) కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. గతంలోనూ ఎంపీటీసీగా ఇద్దరి మధ్య పోటీలో అన్నపై ఓటమి పాలయ్యాడు. ఈసారి విజయం ఎవరిని వరించనుందో చూడాలి.

News February 10, 2026

టాలీవుడ్‌లో మరోసారి సమ్మె?

image

టాలీవుడ్‌లో మళ్లీ సమ్మె జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. సమస్యల పరిష్కారంలో ఆలస్యం చేస్తున్నారంటూ టెక్నీషియన్స్(స్టూడియో), ప్రొడక్షన్(సెట్ వర్కర్లు) యూనియన్లు సమ్మెకు సిద్ధమవుతున్నాయి. ఈ విషయమై తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌కు యూనియన్ల ప్రతినిధులు లేఖలు రాశారు. ఈ నెలాఖరులో సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. దీంతో సినీ పెద్దలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.