News March 7, 2025
కొత్తకోట: రోడ్డు ప్రమాదంలో సీడీసీ ఛైర్మన్ మృతి

సీడీసీ ఛైర్మన్ పాపయ్యగారి చంద్రశేఖర్ రెడ్డి(55) హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి సాకారంతో ఉమ్మడి జిల్లా సీడీసీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. గురువారం హైదరాబాదులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందడంతో కొత్తకోటతో పాటు కాంగ్రెస్ పార్టీలో విషాదఛాయలు అలముకున్నాయి.
Similar News
News March 9, 2025
MBNR: ఆత్మహత్యాయత్నం చేసిన వృద్ధురాలు.!

ఓ వృద్ధురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సీసీ కుంట మండలం కురుమూర్తి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ రామ్‌లాల్ నాయక్ వివరాలు.. గ్రామానికి చెందిన చాకలి బాలకిష్టమ్మ మానసికస్థితి సరిగ్గా లేక ఒంటరిగా ఉంటుంది. దుప్పటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఒంటరితనాన్ని భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొందని ఎస్ఐ తెలిపారు.
News March 9, 2025
గిగా కంపెనీతో పాలమూరు రూపురేఖలు మారతాయి: కేంద్ర మంత్రి

అమర్ రాజా కంపెనీ ప్రతిష్ఠాత్మకంగా రూ.3,225 కోట్లతో నిర్మిస్తున్న గిగా ఫ్యాక్టరీతో పాలమూరు రూపురేఖలు మారడం ఖాయమని కేంద్ర రైల్వే శాఖ సమాచార ప్రసార ఐటీ శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ అన్నారు. శనివారం దివిటిపల్లి గ్రామంలో కంపెనీ ప్రారంభం అనంతరం మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డిలతో కలిసి నూతనంగా నిర్మిస్తున్న ప్లాంటును పరిశీలించారు.
News March 8, 2025
నేడు పాలమూరుకు కేంద్రమంత్రి రాక

కేంద్ర రైల్వే, టెక్నాలజీ ఇన్ఫర్మేషన్, బ్రాడ్‌కాస్టింగ్ మంత్రి అశ్విని వైష్ణవ్ నేడు MBNR జిల్లాకు రానున్నారు. స్థానిక ఎంపీ డీకే అరుణతో కలిసి జిల్లాలో పలు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలో ఆయన పాల్గొననున్నారు. ఉదయం 10:30 గంటలకు దివిటిపల్లిలోని అమరరాజు బ్యాటరీ కంపెనీ ఏర్పాటుకు నిర్వహించే భూమి పూజలో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొంటారని బీజేపీ శ్రేణులు పేర్కొన్నారు.