News December 30, 2025

కొత్తగా అన్నమయ్య జిల్లా ఇలా..!

image

☞ జిల్లా కేంద్రం: మదనపల్లె
☞ డివిజన్లు: 3 (రాయచోటి, మదనపల్లె, పీలేరు)
☞ మండలాలు: 25
☞ జనాభా: 14, 22,605
☞ నియోజకవర్గాలు: 5(మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు, రాయచోటి)
☞ రాయచోటి నియోజకవర్గంలోని అన్ని మండలాలు కలిపి ఒకే డివిజన్‌లో ఉంటాయి. పుంగనూరులోని సోమల, సదుం మండలాలు పీలేరులోకి, చౌడేపల్లె, పుంగనూరు మదనపల్లె డివిజన్‌లో కలుస్తాయి. రొంపిచర్ల, పులిచర్ల మాత్రం చిత్తూరు జిల్లాలోనే ఉండనున్నాయి.

Similar News

News December 30, 2025

GNT: సారస్ పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

image

సారస్ (సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిసన్స్ సొసైటీ) మస్కట్‌ను కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో విడుదల చేశారు. రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సౌజన్యంతో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ జనవరి 6 నుంచి 18వ తేదీ వరకు నల్లపాడు రోడ్డులో సారస్ కార్యక్రమం నిర్వహిస్తుందని చెప్పారు. గుంటూరు మిరపకు ప్రసిద్ధి చెందడంతో “మిరప కాయ” నే మస్కట్‌గా ఎంపిక చేసి రూపొందించారని తెలిపారు.

News December 30, 2025

నెల్లూరు: జిల్లా పునర్వ్యవస్థీకరణపై తుది నోటిఫికేషన్ విడుదల

image

APలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 31 నుంచి అమల్లోకి వచ్చేలా నెల్లూరు, తిరుపతి జిల్లాల మధ్య రెవెన్యూ డివిజన్లు–మండలాల పునర్విభజన చేపట్టారు. కొండాపురం, VKపాడును కావలి డివిజన్‌లోకి, గూడూరు, చిల్లకూరు, కోటను గూడూరు డివిజన్‌లోకి చేర్చారు. వాకాడు, చిట్టమూరు(M)ను S.పేట డివిజన్‌లోకి, బాలయపల్లి, వెంకటగిరి, డక్కిలిని శ్రీకాళహస్తి డివిజన్‌లోకి విలీనం చేశారు.

News December 30, 2025

బొకేలు, పుష్పగుచ్ఛాలు వద్దు.. దుప్పట్లు అందజేయాలి: మెదక్ కలెక్టర్

image

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు కలెక్టర్ కార్యాలయానికి వచ్చే వారు బొకేలు, పుష్పగుచ్ఛాలు, శాలువాలు తీసుకొని రావద్దని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. పేద విద్యార్థులకు ఉపయోగపడేలా శీతాకాలన్ని దృష్టిలో పెట్టుకుని చలి నుంచి రక్షణ పొందే దుప్పట్లు అందజేయాలన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు బొకేలు, శాలువాలు, పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలపడం సహజమన్నారు.