News January 6, 2026

కొత్తగా ఉద్యోగంలో చేరిన కార్మికులకు EPFO తప్పనిసరి : కలెక్టర్

image

నూతనంగా ఉద్యోగంలో చేరిన కార్మికులను తప్పనిసరిగా EPFO పరిధిలో వచ్చే విధంగా నమోదు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. సోమవారం వారి ఛాంబర్‌లో ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన (PM-VBRY) అమలుపై జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పని చేస్తున్న కార్మికులను తప్పనిసరిగా EPFO పరిధిలో నమోదు చేయాలన్నారు.

Similar News

News February 21, 2026

నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్‌గా రవి జోసెఫ్

image

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్‌గా రవి జోసెఫ్ నియమితులైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం ఆయన తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గత జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఉద్యోగులు, సిబ్బంది రవి జోసెఫ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

News February 21, 2026

నెల్లూరులో 20వేల మంది ఎదురుచూపులు..!

image

నెల్లూరు జిల్లాలో 29లక్షల మంది జనాభాలో 30,5640 మంది పెన్షనర్లు. వీరికి నెలకు రూ.127 కోట్లు పంపిణీ చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతన పెన్షన్లకు దరఖాస్తులు ఆహ్వానించలేదు. కనీసం ఎంత మంది లబ్ధిదారులు ఉన్నారనే లెక్కలూ సేకరించలేదు. వితంతు పెన్షన్లూ పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. సదరం సర్టిఫికెట్స్ ఉన్నవారితో పాటు అన్ని రకాల కొత్త పెన్షన్ల కోసం జిల్లాలో 20వేల మంది ఎదురు చూస్తున్నారు.