News December 30, 2025

కొత్తగా చిత్తూరు జిల్లా ఇలా..!

image

☞ డివిజన్లు: 4 (చిత్తూరు, కుప్పం, పలమనేరు, నగరి)
☞ మండలాలు: 28
☞ జనాభా: 16,43,224
☞ నియోజకవర్గాలు: 6
☞ పలమనేరు డివిజన్‌లోని బంగారుపాళ్యాన్ని చిత్తూరులోకి మార్చారు. పుంగనూరు, చౌడేపల్లె మదనపల్లె డివిజన్‌లోకి, సోమల, సదుం మండలాలు పీలేరు డివిజన్‌లోకి వెళ్లిపోయాయి. పులిచెర్ల, రొంపిచర్ల చిత్తూరు డివిజన్‌లోనే కొనసాగనున్నాయి. 4మండలాలు అన్నమయ్యలోకి వెళ్లడంతో జిల్లా జనాభా 2,29,727 లక్షలు తగ్గింది.

Similar News

News December 31, 2025

చిత్తూరు: CC కెమెరాలతో 152 కేసుల పరిష్కారం

image

చిత్తూరు జిల్లా పోలీసులు 2025లో సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా 152 కేసులను పరిష్కరించారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 755 లొకేషన్లలో 2406 CC కెమెరాలను ఏర్పాటు చేశారు. దొంగతనాలతో పాటు ఇతర నేరాలకు సంబంధించి CC కెమెరాల ద్వారా నిందితులను గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సైతం CC కెమెరాల ఏర్పాటుపై పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

News December 31, 2025

చిత్తూరు జిల్లాలో 1021 సెల్ ఫోన్ల రికవరీ

image

చిత్తూరు జిల్లాలో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని భారీగా సెల్‌ఫోన్లు రికవరీ చేశారు. జిల్లా వ్యాప్తంగా రూ.2.42 కోట్ల విలువైన 1021 ఫోన్లను చాట్ బాట్ ద్వారా పోలీసులు రికవరీ చేశారు. మూడు దశల్లో సెల్ ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు వాటిని బాధితులకు అప్పగించారు. చోరీ అయిన వెంటనే బాధితులు తమ ఫోన్ల కోసం పోలీసులను ఆశ్రయిస్తుండటంతో రికవరీ శాతం పెరిగింది.

News December 31, 2025

చిత్తూరు జిల్లాలో 128 మందిపై డ్రగ్స్ కేసులు

image

చిత్తూరు జిల్లాలో ఈ ఏడాది 128 మంది మీద మాదక ద్రవ్యాల చట్టానికి సంబంధించి 42 కేసులను నమోదు చేశారు. 98 కేజీల గంజాయి, 23 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 35 ఎక్సైజ్ కేసులు నమోదు కాగా.. 327 మందిని అరెస్ట్ చేశారు. 4400 లీటర్ల సారా, 2124 లీటర్ల అక్రమ మద్యం పట్టుబడింది. 21 వాహనాలను ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. 2024తో పోలిస్తే ఈ సంఖ్య గణనీయంగా తగ్గింది.