News December 30, 2025
కొత్తగా తిరుపతి జిల్లా ఇలా..!

☞ డివిజన్లు: 3 (తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట)
☞ మండలాలు: 36
☞ జనాభా: 29,47,547
☞ నియోజకవర్గాలు: 7
☞ గూడూరును నెల్లూరులో కలపడంతో ఆ డివిజన్‌లో ఉన్న వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లెను శ్రీకాళహస్తి డివిజన్‌లో, వాకాడు, చిట్టమూరును సూళ్లూరుపేట డివిజన్‌లో కలిపారు. రైల్వేకోడూరు నియోజకవర్గం మొత్తం తిరుపతి రెవెన్యూ డివిజన్‌లోకి వస్తుంది.
Similar News
News December 31, 2025
VKB: 102 మందిపై కేసులు నమోదు

రహదారి భద్రతను దృష్టిలో ఉంచుకుని నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 102 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ స్నేహ మెహ్రా పేర్కొన్నారు. పాత నేరస్తులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా 185 మందిని ఫింగర్ ప్రింట్ డివైజ్ ద్వారా తనిఖీ చేసి వారి పూర్వపరాలను పరిశీలించినట్లు వివరించారు.
News December 31, 2025
న్యూ ఇయర్.. 72 వాహనాలు సీజ్: VKB SP

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ముందస్తు తనిఖీల్లో భాగంగా వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,895 వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు చెప్పారు. తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేకుండా, నంబర్ ప్లేట్లు సక్రమంగా లేని 72 వాహనాలను సీజ్ చేసినట్లు వెల్లడించారు.
News December 31, 2025
చిత్తూరు: పెన్షనర్లకు గమనిక

చిత్తూరు జిల్లాలోని పెన్షనర్లు కచ్చితంగా లైఫ్ సర్టిఫికెట్లు అందజేయాలని ట్రెజరీశాఖ DD రామచంద్ర సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ విరమణ పొందిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కుటుంబ పెన్షన్‌దారులు వార్షిక జీవన ప్రమాణ ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాలన్నారు. జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి 28వ తేదీ లోపు లైఫ్ సర్టిఫికెట్లను ఇవ్వాలని.. గడువులోపు సమర్పించకపోతే మార్చి నెల పింఛన్ నిలిపివేస్తామని స్పష్టం చేశారు.


