News March 24, 2026
కొత్తగా మార్కాపురం MP సీట్..?

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో MLA, MP సీట్లు పెరగనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఒంగోలు, బాపట్ల MP స్థానాలు ఉన్నాయి. కొత్తగా మార్కాపురం పార్లమెంట్‌గా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం 12MLA సీట్లు ఉండగా ఆ సంఖ్య 18కి చేరే అవకాశం ఉంది. గతంలో మార్టూరు నియోజకవర్గంగా ఉండగా దాన్ని పునరుద్ధరించే అవకాశం ఉంది. కొత్తగా పొదిలి, పామూరు, కంభం, చీమకుర్తితో పాటు ఒంగోలులో కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది.
Similar News
News April 14, 2026
ప్రకాశం: మరో ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం

మద్దిపాడు మండలం దొడ్డవరప్పాడు బస్టాండ్ సమీపంలో జాతీయరహదారిపై మంగళవారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ముందు టైరు పగలడంతో అదుపు తప్పి డివైడర్ మీదకు వెళ్లింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమి కాలేదు. తరచూ ట్రావెల్ బస్సులు ప్రమాదాలకు గురవటం ఒకింత ఆందోళనకు గురి చేస్తుంది.
News April 14, 2026
బాలికపై అత్యాచారం.. నిందితుడికి జైలుశిక్ష: ప్రకాశం ఎస్పీ

బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ.5వేల జరిమానా విధిస్తూ ఒంగోలు POCSO కోర్టు తీర్పు వెలువరించింది. దొనకొండ మండలానికి చెందిన వ్యక్తి 14 ఏళ్ల బాలికను మాయమాటలతో హైదరాబాద్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. పోలీసుల దర్యాప్తుతో నేరం రుజువై శిక్ష విధించగా.. సంబంధిత అధికారులను ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీసులను అభినందించారు.
News April 14, 2026
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ప్రకాశం SP

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సూచించారు. 95% సైబర్ దాడులు నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయని సోమవారం తెలిపారు. అనుమానాస్పద మెయిల్స్‌లోని లింకులను క్లిక్ చేయకూడదన్నారు. ఓటీపీలు, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు. అపరిచితుల నుంచి వచ్చే వీడియో కాల్స్‌కు స్పందించకపోవడం మంచిదని ప్రజలకు సూచించారు.


