News January 3, 2026
కొత్తగా రైల్‌వన్ యాప్.. పాత సీజన్ పాస్, వ్యాలెట్ల పరిస్థితేంటి?

UTS(అన్‌రిజర్వ్‌డ్ టికెటింగ్ సిస్టమ్) యాప్‌లో లోకల్ రైళ్ల నెలవారీ పాస్‌ను బుక్ చేసుకునే సౌకర్యాన్ని రైల్వే నిలిపేసింది. రైల్‌వన్ యాప్ ఉపయోగించాలని చెప్పింది. దీంతో ప్రస్తుత సీజన్ పాస్, R-వ్యాలెట్ బ్యాలెన్స్ ఏమవుతాయోనని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ‘ఇప్పటికే తీసుకున్న పాస్‌లు గడువు ముగిసేదాకా చెల్లుతాయి. UTSలో ఇకపైనా జనరల్, ప్లాట్‌ఫామ్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు’ అని రైల్వే క్లారిటీ ఇచ్చింది.
Similar News
News February 5, 2026
మచ్చల్ని తగ్గించే జాజికాయ ఫేస్‌ప్యాక్

జాజికాయని వాడడం వల్ల ముఖంపై మచ్చలు తగ్గడమే కాదు. మొటిమలు కూడా రాకుండా ఉంటాయంటున్నారు నిపుణులు. 2 టీ స్పూన్ల జాజికాయ పొడి, తేనె, పాలు కలిపి పేస్ట్ చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత ఫేస్‌ప్యాక్‌ని క్లీన్ చేయండి. ఇలా చేస్తే ముఖం బ్రైట్‌గా కనిపిస్తుంది. దీని వల్ల మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. దీని వల్ల ముఖంపై పేరుకుపోయిన అదనపు నూనె కూడా తొలగిపోతుందంటున్నారు.
News February 5, 2026
మోదీపై దాడికే మహిళా ఎంపీల మోహరింపు: BJP MP

నిన్న లోక్‌సభ అర్ధాంతరంగా వాయిదాపడి PM మోదీ ప్రసంగం రద్దవడం తెలిసిందే. అయితే దీనికి కారణం మోదీ కూర్చున్న సీటు చుట్టూ తమ మహిళా MPలను విపక్షం మోహరించడమేనని NDTV పేర్కొంది. నరవణే పుస్తకంపై రాహుల్‌ను అనుమతించకపోవడంతో విపక్షం యుద్ధమార్గంలో వెళ్తున్నట్టుగా ఉందని విశ్లేషించింది. కాగా మోదీపై దాడి చేసేందుకే తమ మహిళా ఎంపీలను PM సీటు వద్ద విపక్షం మోహరించిందని BJP ఎంపీ మనోజ్ తివారీ ఆరోపించారు.
News February 5, 2026
చల్కా భూములను సాగుకు అనువుగా ఎలా మార్చాలి?

చల్కా నేలల్లో లవణం, ఇసుక సమాన మోతాదులో ఉంటాయి. సేంద్రియ కర్బనం తక్కువగా.. ఐరన్, అల్యూమినియం ఆక్సైడ్‌లు ఎక్కువగా ఉండటం వల్ల సాగులో సమస్యలు వస్తాయి. ఈ భూముల్లో మొలక రాకపోవటం, వచ్చినా దెబ్బతినడం, మొక్కల సాంద్రత తగ్గుతుంది. ఈ భూముల్లో ఏటా ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువును పంట విత్తే ముందు వేసుకోవాలి. మల్చింగ్ వేయాలి. విత్తిన సాళ్ల వెంబడి పశువుల ఎరువును వేస్తే మొలక శాతం పెరుగుతుంది.


