News January 20, 2026

కొత్తగూడెంలో సీఎం రేవంత్ రెడ్డిపై కంప్లైంట్

image

ఖమ్మం సభలో సీఎం రేవంత్ బీఆర్ఎస్ శ్రేణులను రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు విమర్శించారు. సోమవారం ఎస్పీ రోహిత్ రాజును కలిసి ఫిర్యాదు చేశారు. ‘బీఆర్ఎస్‌ను 100 మీటర్ల లోతున పాతాలి, గ్రామాల్లో పార్టీ దిమ్మెలను కూల్చాలి’ అంటూ హింసను ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Similar News

News February 14, 2026

కాసేపట్లో మంత్రులతో సీఎం భేటీ.. కొత్తగూడెంపై నిర్ణయం!

image

ఉత్కంఠ రేపుతున్న కొత్తగూడెం కార్పొరేషన్ పీఠం వ్యవహారం సీఎం రేవంత్ రెడ్డి వద్దకు చేరింది. సీపీఐ తీర్మానం, జిల్లా మంత్రుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న సీఎం.. రెండు పార్టీల పొత్తు ధర్మంపై దిశానిర్దేశం చేయనున్నారు. కాసేపట్లో మంత్రులతో భేటీ అనంతరం మేయర్ అభ్యర్థిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అధిష్ఠానం నిర్ణయంపైనే అభ్యర్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంది.

News February 14, 2026

Big Plan: హైదరాబాద్ మహా అవతారం!

image

HYD మరింత పెద్దది కాబోతోంది. ప్రస్తుతం HMDA పరిధి 7,257 చదరపు కిలోమీటర్లు ఉండగా దీన్ని 10,472 చదరపు KMకు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని ద్వారా 11 జిల్లాల పరిధిలోని RRR ప్రాంతాలన్నీ ఒకే గొడుగు కిందకు వస్తాయి. ముఖ్యంగా ‘ల్యాండ్ పూలింగ్’ (LADP) పద్ధతిలో 10 భారీ టౌన్‌షిప్‌ల నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఈ విస్తరణ పూర్తయితే HYD దేశంలోనే అతిపెద్ద మెట్రోపాలిటన్ ఏరియాల్లో ఒకటిగా మారుతుంది.

News February 14, 2026

విజయవాడ: ఈనెల 18న స్పెసిఫిక్ జాబ్ డ్రైవ్

image

ఏలూరు రోడ్ గుణదల సెంటర్‌‌లోని ఏరోస్కిల్స్ ఎయిర్‌పోర్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ సంస్థలో ఈ నెల 18న జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు APSSDC అధికారులు తెలిపారు. SSC, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ చదివి 18-40 ఏళ్లలోపు అభ్యర్థులు జాబ్ డ్రైవ్‌కు హాజరుకావొచ్చన్నారు. ఎంపికైనవారికి నెలకు రూ.23-67 వేల వేతనం ఉంటుందన్నారు. https://naipunyam.ap.gov.in/user-registrationలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.