News December 19, 2025
కొత్తగూడెంలో 37 సీపీఐ సర్పంచులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేస్తుంది. అధికార కాంగ్రెస్ 271, ప్రతిపక్ష బీఆర్ఎస్ 105, సీపీఐ 47, ఇతరులు 46 గ్రామపంచాయతీల్లో విజయం సాధించారు. భద్రాద్రి జిల్లాలో బీజేపీ పార్టీ ఏ ఒక్క గ్రామపంచాయతీలో పాగా వేయలేదు. కొత్తగూడెం నియోజకవర్గంలో సీపీఐ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 37 సర్పంచ్ స్థానాల్లో గెలుపొందారు.
Similar News
News December 21, 2025
వాట్సాప్‌లో కొత్త మోసం.. జాగ్రత్త: సజ్జనార్

TG: వాట్సాప్‌లో ‘ఘోస్ట్ పెయిరింగ్’ పేరిట కొత్త స్కామ్ జరుగుతోందని HYD సీపీ సజ్జనార్ తెలిపారు. ‘Hey.. మీ ఫొటో చూశారా? అంటూ లింక్ వస్తే క్లిక్ చేయొద్దు. క్లిక్ చేస్తే హ్యాకర్ల డివైజ్‌కు మీ అకౌంట్ కనెక్టవుతుంది. మీ పర్సనల్ డేటా చూసి మీ పేరుతో ఇతరులకు మెసేజ్‌లు పంపి మోసం చేస్తారు. WhatsApp సెట్టింగ్స్‌లో ‘Linked Devices’ ఆప్షన్‌ను చెక్ చేసి తెలియని డివైజ్‌లు ఉంటే రిమూవ్ చేయండి’ అని ట్వీట్ చేశారు.
News December 21, 2025
TDP జిల్లా అధ్యక్షులు వీరే! 1/2

AP: TDP జిల్లా అధ్యక్షుల పేర్లు ప్రకటించారు. * తిరుపతి – పనబాక లక్ష్మి * చిత్తూరు – షణ్ముగ రెడ్డి * అన్నమయ్య – సుగవాసి ప్రసాద్ * ప్రకాశం – ఉగ్ర నరసింహా రెడ్డి * అనంతపురం – పూల నాగరాజు * శ్రీ సత్యసాయి – ఎంఎస్ రాజు * నంద్యాల – గౌరు చరితా రెడ్డి * విజయనగరం – కిమిడి నాగార్జున * ఏలూరు – బడేటి రాధాకృష్ణ * కాకినాడ – జ్యోతుల నవీన్ * బాపట్ల – సలగల రాజశేఖర్ * పల్నాడు – షేక్ జానే సైదా
News December 21, 2025
శ్రీ సత్యసాయి: ఒకే నేతకు నాలుగు పదవులు

TDPలో మడకశిర MLA MS రాజుకు ప్రాధాన్యత గణనీయంగా పెరిగింది. మంత్రి లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన ఆయనకు 4 కీలక పదవులు దక్కాయి. ఇప్పటికే మడకశిర MLAగా, TTD బోర్డు సభ్యుడిగా, TDP రాష్ట్ర SC సెల్ అధ్యక్షుడిగా ఉన్న ఆయనను తాజాగా సత్యసాయి జిల్లా TDP అధ్యక్షుడిగా అధిష్ఠానం నియమించింది. యువగళం పాదయాత్ర నుంచి పార్టీ బలోపేతానికి చేసిన సేవలకే ఈ గుర్తింపు లభించిందని మద్దతుదారులు చెబుతున్నారు.


