News March 4, 2025
కొత్తగూడెం: ఆన్‌లైన్ ద్వారా మధ్యాహ్న భోజన చెల్లింపు

విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా మధ్యాహ్న భోజన పథకం బిల్లుల చెల్లింపుపై జిల్లా కలెక్టర్లతో, విద్యాశాఖ అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐడీవోసీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ట్రెజరీ ద్వారా బిల్లుల చెల్లింపు ప్రక్రియ ఆలస్యం అవుతోందని, నేరుగా ఆన్‌లైన్ నుంచే మధ్యాహ్న భోజనం బిల్లులు చెల్లించేందుకు విద్యాశాఖ పరిశీలిస్తుందని అన్నారు.
Similar News
News March 4, 2025
ICC నాకౌట్స్ అంటే హెడ్‌కు పూనకాలే!

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ ఇండియా, ఆస్ట్రేలియా మధ్య సెమీస్ జరగనుంది. ఇందులో ఆసీస్ విధ్వంసకర ప్లేయర్ ట్రావిస్ హెడ్ బరిలోకి దిగుతున్నారు. ఆయనకు ఐసీసీ టోర్నీల్లో ఘనమైన రికార్డు ఉంది. భారత్‌తో జరిగిన ODI WC సెమీస్‌లో 62, ఫైనల్లో 137, WTC ఫైనల్లో 163 బాదారు. ఈ మూడు మ్యాచుల్లోనూ ఆయన ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నారు. ఇవాళ భారత్‌తో మ్యాచ్ కాబట్టి హెడ్ చెలరేగే ఆస్కారం ఉంది.
News March 4, 2025
పులిగుండాల ప్రాంతంలో రూఫస్ బెల్లిడ్ ఈగల్ ప్రత్యక్షం

పెనుబల్లి మండలం పులిగుండాల ప్రాజెక్టు ప్రాంతంలో అరుదైన ఆసియా డేగ కెమెరాల్లో చిక్కింది. అటవీశాఖ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో ఆసియా ప్రాంతానికి చెందిన వేటాడే పక్షి రూఫస్ బెల్లిడ్ ఈగల్‌గా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఈ విలక్షణమైన పక్షి తల, మెడ, రెక్కలు, వీపు, తోక స్లాటీ నల్లగా ఉంది. దాదాపు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న ఈ పక్షి ఇక్కడ కనిపించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
News March 4, 2025
భద్రాచలం బిడ్డకు అత్యున్నత పదవి..!

భద్రాచలం సీనియర్ న్యాయవాది జెట్టి సాల్మన్ రాజుని తెలంగాణ హైకోర్టు ఏజీపీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్న సాల్మన్ రాజు సోమవారం హైకోర్టు ఏజీపీగా నియమితుడై హైకోర్టు అడిషనల్ జనరల్ రంజిత్ రెడ్డి చేతులు మీదుగా నియామక పత్రాన్ని స్వీకరించారు. భద్రాచలం న్యాయవాది హైకోర్టు ఏజీపీగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.