News November 1, 2025

కొత్తగూడెం: ఈవీఎం గోడౌన్ తనిఖీ చేసిన కలెక్టర్

image

ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ జితేష్ వి పాటిల్ శనివారం తనిఖీ చేశారు. ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈవీఎం భద్రతకు సంబంధించి ప్రతినెల తనిఖీ చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ పరిశీలనలో భాగంగా సీసీ కెమెరా గదిలో కెమెరాల పనితీరును పరిశీలించారు. గోడౌన్ పరిసర ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచాలని, అనుమతి లేనిదే ఎవరిని లోపలికి రానివ్వకూడదని అధికారులకు సూచించారు. అనంతరం తనిఖీ రిజిస్టర్లో సంతకం చేశారు.

Similar News

News November 1, 2025

ADB: మాజీ మంత్రి హరీష్ రావును పరామర్శించిన MP నగేశ్

image

మాజీ మంత్రి, MLA తన్నీరు హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ శనివారం హరీష్ రావు నివాసంలో శనివారం పరామర్శించారు. సత్యనారాయణ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.

News November 1, 2025

హుస్సేన్‌సాగర్‌లో యువతి మృతదేహం కలకలం

image

హుస్సేన్‌సాగర్‌లో యువతి మృతదేహం(22) కలకలం రేపింది. లేక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని యువతి మృతదేహం నీటిలో తేలియాడుతుందని ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్‌కు చేరుకున్న లేక్ సిబ్బంది డెడ్‌బాడీని బయటకు తీసి, గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాపు చేపట్టారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.