News December 28, 2025

కొత్తగూడెం: ఈ ఏడాది చోరీ కేసుల వివరాలు ఇలా..!

image

జిల్లాలో ఈ ఏడాది 307 చోరీ కేసుల్లో రూ.3,75,10,691 సొత్తును కోల్పోగా 141కేసుల్లో రూ.1,21,99,297 సొత్తును రికవరీ చేశామని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. లోక్ అదాలత్లో ఈ ఏడాది మొత్తం వివిద రకాల 20,595 కేసులు పరిష్కారమయ్యాయన్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ 15,347 కేసులు, సైబర్‌ క్రైమ్‌ సంబంధించి 196 కేసులు నమోదయ్యాయని వివరించారు. శాంతి భద్రతల పరిరక్షణే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యమని వెల్లడించారు.

Similar News

News January 2, 2026

APPLY NOW: బాల్మర్ లారీలో ఉద్యోగాలు

image

బాల్మర్ లారీ‌లో 18 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే(JAN 4) ఆఖరు తేదీ. పోస్టును బట్టి MTM, MBA, BE/B.Tech,డిగ్రీ, MCA ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష/ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.balmerlawrie.com

News January 2, 2026

ఏపీలో పెరిగిన GST వసూళ్లు

image

AP: డిసెంబర్‌లో రాష్ట్ర GST వసూళ్లు పెరిగాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 5.78% ఎక్కువగా రూ.2,652 కోట్లు వసూలైంది. జాతీయ సగటును (5.61%) సైతం మించింది. దీంతో దక్షిణాదిలో తమిళనాడు తర్వాత రెండో స్థానంలో నిలిచింది. స్థూల వసూళ్లు రూ.3,137 కోట్లకు చేరాయి. SGST, IGST, పెట్రోలియం వ్యాట్‌, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఆదాయాలు కూడా పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.39,517 కోట్ల పన్ను ఆదాయం వచ్చింది.

News January 2, 2026

KNR: డిసెంబర్ ‘కిక్’.. రూ.428.35 కోట్ల హాంఫట్!

image

ఉమ్మడి జిల్లాలో 2025 డిసెంబర్‌లో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిని తాకాయి. కొత్త సంవత్సరం వేడుకలు, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మద్యం ప్రియులు పోటీపడి మరీ మద్యం కొనుగోలు చేశారు. ఎక్సైజ్ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డిసెంబర్‌లో అమ్మకాలు భారీగా జరిగాయి. కరీంనగర్‌లో రూ.154.40, జగిత్యాలలో రూ.112.53, పెద్దపల్లిలో రూ.94.28, సిరిసిల్లలో రూ.67.14 కోట్లుగా అమ్మకాలు నమోదయ్యాయి.