News March 4, 2025

కొత్తగూడెం ఎయిర్‌పోర్టు.. వాతావరణ రిపోర్ట్ కీలకం

image

కొత్తగూడెం ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం చుంచుపల్లి, సుజాతనగర్‌ మండలాల పరిధిలో 900 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. గత జనవరి 23న AAI ఫీజిబులిటీ సర్వే నిర్వహించింది. మరిన్ని వివరాలు కావాలంటూ కేంద్ర వాతావరణ శాఖను కోరింది. ఆ వివరాలు వచ్చిన తర్వాత ఎయిర్‌పోర్టుకు ఎంపిక చేసిన ప్రదేశంలో గాలుల తీరుతెన్నులు, వర్షాలు తదితర అంశాలను బేరీజు వేస్తారు. సానుకూల ఫలితాలు వస్తే తదుపరి కార్యాచరణ మొదలయ్యే అవకాశముంది.

Similar News

News March 4, 2025

వరంగల్: స్వల్పంగా పెరిగిన పత్తిధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.6,880 పలకగా.. ఈరోజు రూ.40 పెరిగింది. దీంతో రూ.6,920 జెండా పాట పలికినట్లు వ్యాపారులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి మార్కెట్ ధరలలో హెచ్చుతగ్గులు ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు.

News March 4, 2025

ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధర వివరాలు

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో మంగళవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,900గా నిర్ణయించారు. సోమవారం ధరతో పోలిస్తే మంగళవారం సీసీఐ ధరలో మార్పు లేదు. ప్రైవేట్ పత్తి ధర రూ.10 తగ్గినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.

News March 4, 2025

మహిళా ఉద్యోగుల కోసం ఉచిత వైద్య శిబిరం: WGL కలెక్టర్

image

వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం మహిళా ఉద్యోగుల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో జరగనున్న ఈ వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి ప్రారంభిస్తారన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఉ.10 గం.లకు ప్రారంభమయ్యే ఈ శిబిరంలో మహిళలు పాల్గొని పరీక్షలు చేయించుకోవాలన్నారు.

error: Content is protected !!