News January 2, 2025
కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్ సర్వే కోసం డిపాజిట్ చెల్లించండి: కేంద్ర మంత్రి
భద్రాద్రి జిల్లాలో ప్రతిపాదిత కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్ సర్వే కోసం ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు 41లక్షలు డిపాజిట్ చేయాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి తుమ్మలకు లేఖ రాశారు. ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మంత్రి తుమ్మల లేఖ ద్వారా కోరారు. కాగా ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి రాష్ట్ర సర్కార్ 950ఎకరాల స్థలం కేటాయించిన విషయం తెలిసిందే.
Similar News
News January 5, 2025
చైనా మాంజా అమ్మొద్దు: సీపీ సునీల్ దత్
ప్రజలు, పక్షుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న చైనా మాంజా అమ్మినా, నిల్వ చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం సీపీ సునీల్ దత్ ఆదేశించారు. ఎస్‌హెచ్ఓలు తనిఖీలు చేపట్టి షాపుల నిర్వాహకులపై కేసులు నమోదు చేయాలన్నారు. ప్రజలు సైతం ఈ మాంజా వినియోగంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. చైనా మాంజా వినియోగాన్ని పూర్తిగా నిషేధించామన్నారు.
News January 4, 2025
వామనావతారంలో దర్శనమిచ్చిన భద్రాద్రి రాముడు
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి శనివారం వామనావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. తొలుత ఆలయ ప్రాంగణంలోని బేడా మండపానికి మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల కోలాహలం నడుమ ఆలయం నుంచి మిథిలా స్టేడియానికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు.
News January 4, 2025
ఖమ్మం: చింతకానిలో గుర్తు తెలియని మృతదేహం
ఖమ్మం జిల్లా చింతకాని నుంచి అనంతసాగర్ వెళ్లే మార్గ మధ్యలో ఉన్న మైసమ్మ గుడి సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. శుక్రవారం రాత్రి 7 గంటలకు వందేభారత్ రైలు కింద పడి ఆ వ్యక్తి మృతి చెందినట్టు స్థానికులు చెబుతున్నారు. వ్యక్తి నుజ్జు నుజ్జు కావడంతో గుర్తు పట్టడం కష్టంగా ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.