News March 2, 2025
కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్‌పై కనిపించని పురోగతి

కొత్తగూడెం జిల్లాలో ఎయిర్‌పోర్టుపై ఉమ్మడి ఖమ్మం ప్రజల ఆశలు అడియాశలవుతున్నాయి. ఇటీవల ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై ఫీజిబిలిటీ సర్వే పూర్తయిన విషయం తెలిసిందే. అయితే ప్రధాని మోదీ వరంగల్‌లో ఎయిర్‌పోర్టు అభివృద్ధికి అనుమతులు మంజూరు చేయగా వేగం పుంజుకుంది. కానీ కొత్తగూడెంలో మాత్రం ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఈ విషయంపై జిల్లా మంత్రులు, రాష్ట్రంలోని కేంద్రమంత్రులు దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News January 24, 2026
జిల్లేడు ఆకులు, రేగు పండ్ల వెనుక రహస్యమిదే..

రథసప్తమి స్నానంలో జిల్లేడు ఆకులు, రేగు పళ్లను తలపై పెట్టుకోవడం వెనుక ఆరోగ్య కారణాలున్నాయి. జిల్లేడు, రేగు, రుద్రాక్ష చెట్లు సూర్యకిరణాలలోని ప్రాణశక్తిని ఎక్కువగా గ్రహించి నిల్వ చేసుకుంటాయి. ఏడాదికి ఒక్కసారైనా ఈ ఆకుల స్పర్శ శరీరానికి తగలడం వల్ల అవి ఔషధ గుణాలుగా పని చేస్తాయి. చర్మ వ్యాధులను నివారిస్తాయి. మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అందుకే వీటితో శిరస్నానం చేయాలని పెద్దలు సూచిస్తారు.
News January 24, 2026
నిజామాబాద్: ఎన్నికల అధికారులకు శిక్షణ

నిజామాబాద్‌లోని కంటేశ్వర్ పాలిటెక్నిక్ కళాశాలలో రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు మున్సిపల్ ఎన్నికలపై శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ అంకిత్, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిబంధనలపై మాస్టర్ ట్రైనర్లు అధికారులకు సమగ్ర అవగాహన కల్పించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.
News January 24, 2026
కడప: జనయాత్ర పుస్తకం ఆవిష్కరణ

ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు జగన్ గతంలో పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. సంబంధిత ఫొటోలతో రూపొందించిన ‘జగన్నాథుని జనయాత్ర’ పుస్తకాన్ని తాడేపల్లిలోని తన కార్యాలయంలో జగన్ శుక్రవారం ఆవిష్కరించారు. పుస్తక రచయిత రాచమల్లు రవిశంకర్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. రచయితను జగన్ అభినందించారు.


