News March 10, 2025

కొత్తగూడెం: కాల్వలో పడి డిగ్రీ విద్యార్థి మృతి

image

మున్నేటిలో పడి డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. పోలీసుల వివరాలు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మొగళ్లపల్లికి చెందని మహేశ్ ఖమ్మంలోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. ఈ నెల 8న స్నేహితులతో కలిసి కాల్వ వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అందులో పడి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటికి తీశారు. కేసు నమోదైంది.

Similar News

News October 27, 2025

నిర్మల్: ‘ప్రజా ఫిర్యాదులను పరిష్కరిస్తాం’

image

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా అందజేస్తున్న ఫిర్యాదులను ఫునఃపరిశీలించి తగిన విధంగా పరిష్కార మార్గాలు చూపుతామని అదనపు కలెక్టర్లు కిషోర్ కుమార్, ఫైజాన్ అహ్మద్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. గ్రామీణ, పట్టణ స్థాయి, వ్యవసాయ భూముల సంబంధిత దరఖాస్తులు అధికంగా వస్తున్నాయన్నారు. క్షేత్రస్థాయిలో ఆయా శాఖల సిబ్బంది పనితనం మెరుగుపరచుకోవాలన్నారు.

News October 27, 2025

తుఫాను.. పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి రూ.3వేలు

image

AP: తుఫానుపై కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో CM చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి రూ.3,000 చొప్పున నగదు, 25 కేజీల బియ్యం సహా నిత్యావసరాల పంపిణీ చేయాలని ఆదేశించారు. మెడికల్ క్యాంపులు నిర్వహించాలని, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా చెరువులు, కాలువ గట్లు తెగిపోకుండా చూడాలని, ప్రజలెవరూ బయటకు రాకుండా చూసుకోవాలని తెలిపారు.

News October 27, 2025

నిర్మల్: యూ డైస్ వివరాలను నమోదు చేయాలి: డీఈవో

image

ప్రతీ పాఠశాల యూ డైస్‌లో వివరాలను ఖచ్చితంగా, సరియైన విధంగా నమోదు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న అన్నారు. నిర్మల్ కొండాపూర్‌లో గల ఓ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. యూ డైస్‌లో గల మూడు రకాల మాడ్యూల్‌లలో పాఠశాల వివరాలను, పాఠశాలలో ఉన్న సౌకర్యాలను, విద్యార్థుల సంబంధించిన వివరాలను ఉపాధ్యాయుల వివరాలను పరిశీలించాలన్నారు.