News July 18, 2024

కొత్తగూడెం: గ్రూప్-1 మెయిన్స్‌కు ఫ్రీ కోచింగ్

image

తెలంగాణ మైనారిటీ స్టడీ సర్కిల్ గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షకు ఉచిత కోచింగ్‌ను అందిస్తోందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి తెలిపారు. అర్హులైన మైనారిటీ అభ్యర్థులు ఈనెల 19 నుంచి 22వ తేదీ వరకు తెలంగాణ మైనారిటీస్ స్టడీ సర్కిల్, హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News August 27, 2025

ఖమ్మం ఉపాధ్యాయుడికి 6 నెలల జైలు శిక్ష

image

చెల్లని చెక్కు కేసులో ఖమ్మంకు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి సత్తుపల్లి అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసరావు ఆరు నెలల జైలు శిక్ష విధించారు. కల్లూరుకు చెందిన రామనరసింహారావు వద్ద ఉపాధ్యాయుడు జయరాజు 2015లో రూ.8.5 లక్షలు అప్పు తీసుకున్నారు. 2016లో తిరిగి చెల్లించేందుకు చెక్కు ఇచ్చాడు. బ్యాంకు ఖాతాలో నగదు లేకపోవడంతో చెల్లలేదు. దీంతో రామనరసింహారావు కేసు దాఖలు చేయగా, విచారణ అనంతరం జడ్జి ఈ తీర్పు ఇచ్చారు.

News August 27, 2025

పంట నమోదు సక్రమంగా చేపట్టాలి: ఖమ్మం DAO

image

పంటల నమోదు ప్రక్రియను సక్రమంగా చేపట్టాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ పంటల సాగు నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించారు. రైతులు సాగు చేసిన పంటల వివరాలను వ్యవసాయ శాఖ అధికారుల వద్ద నమోదు చేయించాలన్నారు. రైతులు పంటల సాగు వివరాలు నమోదు చేయించకపోతే ధాన్యం కొనుగోలు సమయంలో ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆయన తెలిపారు.

News August 27, 2025

ఇండోర్ తరహాలో ఖమ్మంలో ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్

image

ఖమ్మం నగరంలో త్వరలో ప్లాస్టింగ్ వ్యర్థాల రీసైక్లింగ్ ప్రారంభిస్తామని నగర మేయర్ నీరజ అన్నారు. మంగళవారం ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అమలు చేస్తున్న ఆధునిక వ్యర్థ నిర్వహణ విధానాలు ఖమ్మంలో కూడా అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని మేయర్ పేర్కొన్నారు.