News April 9, 2025

కొత్తగూడెం: చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో హత్య

image

చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో వ్యక్తిని హత్య చేసిన ఘటన కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో చోటుచేసుకుంది. సీఐ అశోక్ వివరాలిలా.. మండలంలోని జెడ్ వీరభద్రపురానికి చెందిన కొమరం రాముడు గతనెల11న అదృశ్యంకాగా, మృతదేహం మంగళవారం ఆ గ్రామ చెరువులో లభ్యమైంది. చేతబడి వల్లే తమ కుటుంబ సభ్యులు చనిపోయారని మృతుడి బంధువులు వెంకటేశ్వరావు, పద్దం బాలరాజు రాముడిపై పగ పెంచుకొని హత్య చేసి, చెరువులో పడేశారని సీఐ చెప్పారు.

Similar News

News April 17, 2025

సమ్మర్ టూర్.. ఉమ్మడి ఖమ్మం జిల్లాను చుట్టేద్దాం..

image

సమ్మర్ HOLIDAYS వచ్చాయంటే ఫ్యామిలీతో కలిసి ఎక్కడికి వెళ్లాలా అని ఆలోచిస్తుంటారు. మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ చాలా పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలు ఉన్నాయి. ఖమ్మం ఫోర్ట్, పాపికొండలు, పులిగుండాల, లకారం ట్యాంక్‌బండ్, నేలకొండపల్లి బౌద్ధ క్షేత్రం, భద్రాచలం రామయ్య గుడి, పర్ణశాల, కిన్నెరసాని ప్రాజెక్ట్, పాల్వంచ పెద్దమ్మ గుడిని ఒక్క రోజులో చుట్టేయొచ్చు. వీటిలో మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో కామెంట్ చేయండి

News April 17, 2025

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో టేకులపల్లి వాసి

image

టేకులపల్లి మండలం సంపత్‌న‌గ‌ర్‌కు చెందిన కుడితేటి ర‌మేశ్‌కు గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్‌లో చోటు ద‌క్కింది. క్రిస్టియన్ గీతాలపై ప్రపంచ స్థాయిలో జరిగిన ఆన్‌లైన్ మ్యూజిక్ ప్రదర్శనలో ర‌మేశ్ పాల్గొనగా కీబోర్డు వాయిద్య బృందం గంట‌లో 1,046 వీడియోలు అప్‌లోడ్ చేసింది. ఈ బృందంలో ర‌మేశ్ స‌భ్యుడు. సోమ‌వారం హోలెల్ మ్యూజిక్ స్కూల్ నిర్వాహకుల చేతుల మీదుగా మెడ‌ల్ అందుకున్నాడు.

News April 17, 2025

ఖమ్మం: పోలీస్ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియో చెక్కును అందజేసిన సీపి

image

ఖమ్మం పట్టణంలోని ట్రాఫిక్ స్టేషన్లో ఏఎస్ఐ‌గా విధులు నిర్వహిస్తున్న ఎండీ షౌకత్ అలీ ఇటీవల మృతి చెందారు. ఈ సందర్భంగా పట్టణంలోని పోలీస్ కమిషనరేట్‌లో ఏఎస్ఐ షౌకత్ అలీ కుటుంబానికి మంజూరు అయిన రూ.8 లక్షల ఎక్స్‌గ్రేషియో చెక్కును బుధవారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

error: Content is protected !!