News November 14, 2025
కొత్తగూడెం: జాతీయ స్థాయిలో సింగరేణికి అవార్డు

కేంద్ర బొగ్గు, గనుల శాఖ నిర్వహించిన స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ 5.0లో సింగరేణి సంస్థ జాతీయ స్థాయిలో అత్యుత్తమ కంపెనీగా ఎంపికైంది. గురువారం ఢిల్లీలో జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ అవార్డును సింగరేణి సీఎండీ ఎన్.బలరాంనకు అందజేశారు. కోల్ ఇండియాతో పాటు ఇతర గనుల సంస్థల నుంచి సింగరేణి ఈ గుర్తింపు సాధించింది.
Similar News
News November 14, 2025
తిరుమల: సాఫీగా ఇంటర్వ్యూలు

TTD వేద పారాయణదారుల పోస్టుల ఇంటర్వ్యూల్లో అకడమిక్ అబ్జర్వర్ తీరు గత మూడు రోజులుగా చర్చకు దారి తీసింది. ఈ మెయిల్స్ ద్వారా ఆయనపై పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయం Way2Newsలోనూ రావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. అబ్జర్వర్ పని మాత్రమే చేయాలని, ఇతర పనులు చేయాల్సిన అవసరం లేదని చెప్పడంతో గురువారం సాఫీగా ఇంటర్వ్యూలు జరిగాయి.
News November 14, 2025
చెత్త సేకరణ సక్రమంగా జరగాలి: కర్నూలు కలెక్టర్

గ్రామాల్లో ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా జరగాలని కర్నూలు కలెక్టర్ డా.ఎ.సిరి అధికారులను ఆదేశించారు. కోసిగి, ఆదోని, ఎమ్మిగనూరు మండలాలు చెత్త సేకరణలో చివరి స్థానాల్లో ఉన్నాయని, వెంటనే మెరుగుపరచాలని సూచించారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న 63 సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లను త్వరగా పూర్తి చేయాలని, తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు.
News November 14, 2025
16న సోమందేపల్లికి బాలకృష్ణ రాక

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలానికి ఈ నెల 16న హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రానున్నట్లు మంత్రి సవిత తెలిపారు. సోమందేపల్లిలో ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఎన్టీఆర్ విగ్రహాన్ని బాలకృష్ణ ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.


