News April 7, 2025
కొత్తగూడెం జిల్లాలో నేడు ప్రజావాణి రద్దు

భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకం ఉన్నందున సోమవారం కొత్తగూడెం కలెక్టరేట్లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు పట్టాభిషేక కార్యక్రమంలో ఉండటం వల్ల ప్రజావాణిని రద్దు చేసినట్లు చెప్పారు. కావున జిల్లా ప్రజలు ఎవరు కూడా తమ సమస్యలపై ప్రజావాణికి రావొద్దని సూచించారు.
Similar News
News April 9, 2025
చిత్తూరు: యువతి ప్రేమ నిరాకరించిందని..!

ఓ యువకుడు తన వాహనానికే నిప్పు పెట్టుకున్న ఘటన పుంగనూరు మండలంలో జరిగింది. గిరి అనే యువకుడు పూజాగానిపల్లికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. తన ప్రేమను నిరాకరించిదన్న కోపంతో గిరి ఆమె ఇంటి ముందు మంగళవారం తన బైక్‌పై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. అడ్డుకున్న స్థానికులతో వాగ్వాదానికి దిగాడు. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
News April 9, 2025
సైబర్ సేఫ్ జిల్లాగా నంద్యాల: SP

నంద్యాల జిల్లాను సైబర్ సేఫ్ జిల్లాగా చేయాలనే ఉద్దేశంతో సైబర్ నేరాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పోలీసులు డిజిటల్ అరెస్టులు చేయరని స్పష్టం చేశారు. మహిళలు ఆన్‌లైన్ స్నేహాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్ల పేరిట విదేశీ నంబర్ల నుంచి వచ్చే మోసపూరిత వాట్సప్ సందేశాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News April 9, 2025
విషాదం.. ఎల్లెల్సీలో ఈతకు వెళ్లి బాలుడి మృతి

అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు అనుమేశ్ ఎల్లెల్సీలో ఈతకు వెళ్లి మృతి చెందడంతో చిన్నకడబూరుకు చెందిన తల్లిదండ్రులు హనుమంతు, నాగలక్ష్మి శోకసంద్రంలో మునిగిపోయారు. ఎల్లెల్సీ పక్కన ఉన్న తమ పొలంలో పని చేసుకుంటున్న తల్లిదండ్రులకు కుమారుడి మృతి విషయం గుండెపగిలేలా చేసింది. పుట్టుకతో అనుమేశ్‌కు మాట రాకపోయినా కంటికి రెప్పలా కాపాడుకున్నామని తండ్రి హనుమంతు రోదించారు.