News March 4, 2025
కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆదేశాలు

కొత్తగూడెం జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీవోసీ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా వైద్య విధాన పరిషత్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ఆసుపత్రుల ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యం కోసం అధునాతన యంత్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
Similar News
News March 4, 2025
అనకాపల్లి ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా విడుదల

అనకాపల్లి జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను విడుదల చేసినట్లు డీఈవో అప్పారావు నాయుడు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ ఆధారంగా జాబితాను రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ జాబితాను తమ కార్యాలయం నోటీస్ బోర్డులో ఉంచామన్నారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 10వ తేదీలోగా తెలియజేయాలన్నారు.
News March 4, 2025
SRPT: టీచర్ MLC ఎన్నికలు.. ‘ఏక్’ నిరంజన్!

NLG – KMM – WGL టీచర్ MLC ఎన్నికల ఫలితాల్లో ఓ అభ్యర్థి ఒకటే ఓటు వచ్చింది. ఈ ఎన్నికల్లో మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీ చేయగా అందులో బంకా రాజు-7, కంటె సాయన్న-5, చలిక చంద్రశేకర్-1 సింగిల్ డిజిట్ ఓట్లకే పరిమితమయ్యారు. కాగా.. మరో ఆరుగురు తాటికొండ వెంకటయ్య-39, జంగిటి కైలాసం-26, పన్నాల గోపాల్‌రెడ్డి-24, అర్వ స్వాతి-20, లింగిడివెంకటేశ్వర్లు-15, పురుషోత్తంరెడ్డి-11 డబుల్ డిజిట్ ఓట్లతో సరిపెట్టుకున్నారు.
News March 4, 2025
హన్వాడ: భర్తను హత్య చేసిన భార్య!

భార్య చేతిలో భర్త హత్యకు గురైన ఘటన హన్వాడ మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాలిలా.. మండలంలోని ఇబ్రహీంబాద్‌కి చెందిన శ్రీనివాస్‌గౌడ్(47) రోజువారీగా పనికి వెళ్లి ఆదివారం రాత్రి ఇంటికి వచ్చాడు. కూలీ డబ్బులు తగ్గాయనే విషయమై భార్య లక్ష్మి ఆయనతో గొడవ పడింది. శ్రీనివాస్ పడుకున్నాక కొడుకుతో కలిసి గొంతు నులిమి చంపేసింది. ఇన్స్‌రెన్స్ డబ్బుకోసమే ఆమె ఇలా చేసుంటుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.