News April 7, 2025
కొత్తగూడెం జిల్లా ప్రజలకు CM గుడ్ న్యూస్

శ్రీరామనవమి సందర్భంగా ఖమ్మం జిల్లా రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.13,057 కోట్లను సవరించి రూ.19,324 కోట్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. అలాగే కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుకు కూడా ఆమోదం లభించింది. దీంతో ఉమ్మడి జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News April 9, 2025
ఆదాయం పెంచేలా పని చేయండి.. CM ఆదేశం

AP: సొంతంగా ఆదాయం పెంచుకునేలా, పన్నుల వసూళ్లు పెరిగేలా ఆదాయార్జన శాఖలన్నీ పని చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మరిన్ని ఆదాయ మార్గాలను వెతకడంతో పాటు ఎక్కడ ఆదాయం తక్కువగా నమోదవుతుందో తెలుసుకోవాలన్నారు. పన్ను ఎగవేతదారులను పసిగట్టేందుకు ఏఐని వినియోగించుకోవాలని సూచించారు. నూతన ఎక్సైజ్ పాలసీ సక్సెస్ అయిందని, అక్టోబర్ 2024 నుంచి మార్చి 2025 వరకు రూ.4,330 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు.
News April 9, 2025
అధికారులు సమస్యలను వెంటనే పరిష్కరించాలి: కడియం

దేవాదుల ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్ట్ అని స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎమ్మెల్యే అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులు పంటలు ఎండిపోయి ఇబ్బందులు పడుతుంటే అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అధికారులు సమస్యలను వెంటనే గుర్తించి వాటిని పరిష్కరించాలని సూచించారు.
News April 9, 2025
రాష్ట్ర పండుగగా అంబేడ్కర్ జయంతి: అనకాపల్లి కలెక్టర్

అంబేడ్కర్ జయంతిని ఈనెల 14వ తేదీన రాష్ట్ర పండుగగా నిర్వహించనున్నట్లు అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ బుధవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం నెహ్రూ చౌక్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పిస్తామన్నారు. అనంతరం గుండాల వద్ద శంకరన్ సమావేశ మందిరంలో జయంతి ఉత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజా ప్రతినిధులు, ప్రజలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.