News January 2, 2026
కొత్తగూడెం: “ట్రాన్స్ జెండర్లకు ఆర్థిక పునరావాస పథకం”

భద్రాద్రి జిల్లాలోని ట్రాన్స్ జెండర్స్‌కి ఆర్థిక పునరావాస పథకం కింద ఒక్కొక్క యూనిట్‌కి రూ.75,000 చొప్పున మొత్తం 8 యూనిట్లకు 100% సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లేనినా తెలిపారు. జిల్లాలోని అర్హులైన ట్రాన్స్ జెండర్స్ పర్సన్స్ wdsc.telangana.gov.in వెబ్ సైట్ నుంచి దరఖాస్తు ఫారం డౌన్ లోడ్ చేసుకొని సంబంధిత అన్ని ధ్రువపత్రాలతో దరఖాస్తు చేయాలన్నారు.
Similar News
News February 19, 2026
గర్భనిరోధక మాత్రలను ఎప్పుడు తీసుకోవాలి?

అసురక్షిత సంభోగం జరిగిన 72 గంటల్లోపు ఒక మాత్రను తీసుకుంటే ఉత్తమ ఫలితాలు పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మీ వైద్యుడి సిఫార్సు మేరకు దీన్ని 5 రోజుల వరకు తీసుకోవచ్చు. అయితే మీరు సంభోగంలో పాల్గొన్న అనంతరం టాబ్లెట్‌ను ఎంత త్వరగా తీసుకుంటే గర్భం రాకుండా ఉండే అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి. సంభోగంలో పాల్గొని 72 గంటలు గడిస్తే మాత్రం వైద్యులను సంప్రదించడం మంచిది.
News February 19, 2026
జమ్మికుంట: స్వల్పంగా పెరిగిన పత్తి ధర

జమ్మికుంట మార్కెట్లో పత్తి ధర నిన్నటి కంటే ఈరోజు స్వల్పంగా పెరిగింది. బుధవారం క్వింటా పత్తి ధర రూ.7,500 పలుకగా.. బుధవారం రూ.50 పెరిగి రూ.7,550 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. గురువారం మార్కెట్‌కు రైతులు 34 వాహనాల్లో 244 క్వింటాళ్ల విడి పత్తిని తీసుకువచ్చినట్లు చెప్పారు. మార్కెట్‌కు పత్తిని తీసుకువచ్చే రైతులు నాణ్యత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
News February 19, 2026
పొదిలి: ఒక్కో ప్లేట్‌కు రూ.50.. మిమ్మల్నీ అడిగారా?

పొదిలిలో విద్యుత్ సర్వీసు నంబర్ ప్లేట్లు బిగించి ప్రతి ఒక్కరి వద్ద రూ.50 వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. పాత ప్లేట్ ఉన్నప్పటికీ.. తప్పనిసరిగా కొత్త ప్లేట్ పెట్టాలంటూ తమ దగ్గర డబ్బులు తీసుకున్నారని చెప్పారు. విద్యుత్ శాఖ అధికారులను వివరణ కోరగా.. తమకు సంబంధం లేదని.. ప్రైవేట్ కాంట్రాక్టర్ వాటిని బిగిస్తున్నారని చెప్పారు.


