News October 14, 2024
కొత్తగూడెం: తండ్రిని హత్యచేసిన తనయుడు

మద్యానికి బానిసైనా కొడుకు తండ్రిని హతమార్చిన ఘటన దమ్మపేట మండలం వడ్లగూడెంలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. కృష్ణయ్య(70), భార్య మంగమ్మ కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారి కొడుడు సత్యనారాయణ మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం మద్యం కోసం కృష్ణయ్య వద్ద డబ్బులు అడగటంతో గొడవ మొదలైంది. కోపోద్రిక్తుడైన కొడుకు తన తండ్రి మెడను కత్తితో కోశాడు. కృష్ణయ్యను ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
Similar News
News January 23, 2026
సహాయక పరికరాలకు దివ్యాంగుల దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం జిల్లాలోని అర్హులైన దివ్యాంగులు సహాయక పరికరాల కోసం ఈ నెల 30వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి వేల్పుల విజేత కోరారు. ఆసక్తి గలవారు సదరం సర్టిఫికేట్, ఆధార్ కార్డు తదితర ధ్రువపత్రాలతో ప్రభుత్వం సూచించిన వెబ్‌సైట్ ద్వారా వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని జిల్లావ్యాప్తంగా ఉన్న దివ్యాంగులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News January 23, 2026
కల్లూరు: గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రమాదం.. ఆప్డేట్

కల్లూరు మండలంలోని లింగాల సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవేపై శుక్రవారం <<18932335>>రోడ్డు <<>>ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఎస్ఐ హరిత వివరాల ప్రకారం.. ఏపీలోని చింతలపూడి మండలానికి చెందిన గట్టు రాంబాబు, కొమ్ము సాయి బైక్‌పై వెళ్తూ అదుపుతప్పి హైవే రైలింగ్‌ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పెనుబల్లి ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
News January 23, 2026
కల్లూరు: గ్రీన్ ఫీల్డ్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి

కల్లూరు మండలం లింగాల గ్రామ సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవేపై శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఇంకా ప్రారంభం కాని ఈ రహదారిపై బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుల వివరాల కోసం ఆరా తీస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.


