News July 7, 2024

కొత్తగూడెం: తల్లి మందలించిందని యువతి ఆత్మహత్య

image

తల్లి మందలించిందని మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బట్టీల గుంపు గ్రామ పంచాయతీలోని పాయం జానకిరామ్ గుంపునకు చెందిన కోరం కృష్ణవేణి (23) అనే యువతి ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటుంది. పొలంలో పనికి రాకపోవడంతో తల్లి మందలించింది. మనస్తాపానికి గురైన యువతి శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

Similar News

News February 11, 2026

ఖమ్మం జిల్లాలో తొలి రెండు గంటల్లో 15.37% ఓటింగ్

image

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో పోలింగ్ ఉత్సాహంగా ప్రారంభమైంది. తొలి రెండు గంటల్లో (ఉదయం 9 గంటల వరకు) సగటున 14.44 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా కల్లూరులో 19.80%, కనిష్ఠంగా మధిరలో 12.72% పోలింగ్ జరిగింది. ఏదులాపురంలో 15.65%, వైరాలో 14.52%, సత్తుపల్లిలో 15.12% ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. భారీ బందోబస్తు మధ్య ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది.

News February 11, 2026

ఖమ్మం: పుర ఎన్నికలు…1,100 మందితో బందోబస్తు

image

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో పుర ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి. ఎన్నికలకు 1,100మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల విధుల్లో నలుగురు ఆడిషనల్ డీసీపీలు, ఎనిమిది మంది ఏసీపీలు, 25 మంది సీఐలు, 80 మంది ఎస్సైలు, 975 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణలో కఠినంగా వ్యవహరించాలని సీపీ సూచించారు.

News February 11, 2026

ఖమ్మం: సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు

image

జిల్లాలోని సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అధికార యంత్రాంగం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. ఇక్కడ జరుగుతున్న పోలింగ్‌ను ఖమ్మం కలెక్టరేట్‌లోని ప్రత్యేక సెల్ ద్వారా అధికారులు పర్యవేక్షించనున్నారు. మొత్తం పోలింగ్ స్టేషన్లలో 25 సమస్యాత్మక, 32అతి సమస్యాత్మకమైనవిగా గుర్తించి వెబ్ కాస్టింగ్ ఏర్పాటుచేస్తున్నారు. అలాగే, ఎన్నికల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా 163 సెక్షన్ అమలు చేస్తున్నారు.