News April 5, 2024
కొత్తగూడెం: ‘తెలంగాణ ప్రజల పక్షాన పోరాడేది BRS పార్టీ ఒక్కటే’

పార్లమెంట్ ఎన్నికల్లో తన గెలుపు కోసం BRS నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని ఎంపి నామా నాగేశ్వరరావు కోరారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎంపీ నామా మాట్లాడారు. 100 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో వైఫల్యం చెందిందని, ఆటో డ్రైవర్లు, రైతులు, ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజల పక్షాన పోరాడేది BRS పార్టీ ఒక్కటే అని చెప్పారు.
Similar News
News February 25, 2026
ఖమ్మంలో ఇంటర్ తొలి రోజు పరీక్ష ప్రశాంతం

ఖమ్మం జిల్లాలో ఇంటర్ తొలి రోజు పరీక్ష ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మొదటి సంవత్సరం ద్వితీయ భాష పేపర్-1కు 18,258 మందిలో 17,667 మంది హాజరయ్యారు. గాంధీచౌక్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రాన్ని తనిఖీ చేసి ఏర్పాట్లు పరిశీలించారు. సీసీ కెమెరాల నిఘా, ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు కొనసాగాయని, ఎలాంటి అక్రమాలు నమోదు కాలేదని పేర్కొన్నారు.
News February 25, 2026
ఖమ్మంలో డిఫాల్ట్ రైస్ మిల్లులపై కేసులు నమోదు

ఖమ్మం జిల్లాలో సీఎంఆర్ బకాయిలు చెల్లించని 2 రైస్ మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి బుధవారం తెలిపారు. మంగలగూడెంలోని శ్రీ సత్యనారాయణ రైస్ మిల్ రూ.13.84 కోట్లు, రాయిగూడెంలోని వెంకటేశ్వర రైస్ మిల్ రూ.10.88 కోట్లు డిఫాల్ట్ చేసినట్లు పేర్కొన్నారు. సంబంధిత యాజమాన్యాలపై పోలీస్ స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News February 25, 2026
ఖమ్మంలో శుక్రవారం దిశ సమావేశం: కలెక్టర్

ఖమ్మంలో ఫిబ్రవరి 27న మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష జరగనుండగా, సభ్యులు, ఆయా శాఖల అధికారులు పూర్తి సమాచారంతో తప్పని సరి హాజరుకావాలని సూచించారు.


