News February 2, 2025
కొత్తగూడెం: దివ్యాంగులకు శుభవార్త.. గడువు పొడిగింపు
దివ్యాంగులకు సబ్సిడీ లోన్స్ దరఖాస్తు గడువును ఫిబ్రవరి 12వ తేదీ వరకు పొడిగించారని జిల్లా సంక్షేమ శాఖ అధికారి జేఎం స్వర్ణలత తెలిపారు. ఎకనామిక్ రిహాబిలిటేషన్ స్కీం ద్వారా స్వయం ఉపాధి, పునరావాసం, చేతి వృత్తులు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోడానికి జిల్లాలోని దివ్యాంగులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. tgobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవాలన్నారు.
Similar News
News February 2, 2025
చనిపోయే ముందు తణుకు ఎస్ఐ చాటింగ్..?
తణుకు ఎస్‌ఐ మూర్తి ఆత్మహత్య కేసులో మిస్టరీ వీడలేదు. పోలీస్ స్టేషన్ ఆవరణలోని బాత్రూం వద్ద ఆయన గన్‌తో కాల్చుకునే ముందు ఆయన ఫోనులో ఎవరితోనో చాటింగ్ చేసినట్లు తెలుస్తోంది. సంబంధిత దృశ్యాలు స్టేషన్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఎస్ఐ ఫోన్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఆ చాటింగ్ బయట పెడితేనే వాస్తవాలు వెల్లడవుతాయని బంధువులు అంటున్నారు. ఆయన స్వగ్రామం కోనసీమ జిల్లా కె.గగవరం
News February 2, 2025
NRPT: సబ్సిడీపై మామిడి రైతులకు ఫ్రూట్స్ కవర్లు
మామిడి తోటలు సాగు చేసే రైతులకు సబ్సిడీపై ఫ్రూట్స్ కవర్లు అందిస్తామని నారాయణపేట జిల్లా ఉద్యానవన శాఖ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. చెట్టుపై మామిడి కాయలను కవర్లు కడితే అధిక దిగుబడి, కాయ మొత్తానికి ఒకే రంగు, ఎలాంటి మచ్చలు ఉండవని చెప్పారు. కాయలకు అధిక ధర వస్తుందని అన్నారు. ఎకరాకు 8 వెల కవర్లను 50 శాతం సబ్సిడీపై అందిస్తామని చెప్పారు. కవర్లు కావాల్సిన రైతులు 8977714457 నంబర్‌కు సంప్రదించాలని అన్నారు.
News February 2, 2025
HYD: విద్యుత్ తక్షణ సేవలకు టోల్ ఫ్రీ నం. 1912
ప్రస్తుత విద్యుత్ వినియోగం డిమాండ్ తీరును పరిశీలిస్తే రానున్న వేసవిలో డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. డిమాండ్ ఎంతగా పెరిగినా.. దానికి తగ్గట్టుగా సరఫరా అందించేందుకు విద్యుత్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. గ్రేటర్ పరిధిలో విద్యుత్ సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ 1912 నంబర్ ద్వారా తక్షణ సేవలను పొందాలని వారు సూచించారు.