News April 14, 2025
కొత్తగూడెం: పిల్లలపై నిరంతరం అప్రమత్తంగా ఉండండి

మరికొద్ది రోజుల్లో విద్యార్థులకు 2 నెలల వేసవి సెలవులు రానున్నాయి. దీంతో పిల్లలు నదులు, చెరువుల్లో ఈత కొట్టడానికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకునే అవకాశం ఉంది. కనుక తల్లిదండ్రులు పిల్లల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. వారిపై ఎప్పటికీ అప్పుడు నిఘా ఉంచాలి. అలాగే ఎండలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
Similar News
News February 25, 2026
భద్రాద్రి జిల్లాలో ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు

భద్రాద్రి జిల్లావ్యాప్తంగా బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా ముగిశాయి. 37 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు మొత్తం 9,685మంది విద్యార్థులకు గాను 9,210 మంది (95.09%) హాజరైనట్లు అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తెలిపారు. జనరల్ విభాగంలో 7,973 మందికి 7,683 మంది, వొకేషనల్ విభాగంలో 1,712 మందికి 1,527 మంది హాజరయ్యారు. మొత్తం 475 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.
News February 25, 2026
జనగామ: రేపటి నుంచి స్టెమ్ వర్క్‌షాప్

ధర్మకంచ ZPHSలో పాఠశాలలో రేపటి నుంచి రెండు రోజుల స్టెమ్ అడ్వాన్స్ వర్క్‌షాప్ ప్రారంభమవుతుందని ప్రోగ్రాం ఆఫీసర్ గట్టు రమేశ్ తెలిపారు. రోబోటిక్స్, ఏరోడైనమిక్స్, స్పేస్ సైన్స్ రంగాల్లో 12 మంది టెక్నికల్ నిపుణులు శిక్షణ అందిస్తున్నారు. మండలంలోని 5 ప్రభుత్వ పాఠశాలల నుంచి ఎంపికైన 250 మంది విద్యార్థులు పాల్గొంటున్నారని, ఆధునిక సాంకేతిక నైపుణ్యాలపై అవగాహన పెంపొందించడం ఈ వర్క్ షాప్ లక్ష్యమని అన్నారు.
News February 25, 2026
HYD: ఇంట్లో చిరాకులు.. బయటే హాయిగా ఉంది!

‘మా వాళ్లతో మాట్లాడితే గొడవే అవుతుంది’.. ఇది యువత మాట. ఇంట్లో సరైన కమ్యూనికేషన్ లేకపోవడం యువతను ఒంటరి చేస్తోంది. పేరెంట్స్ అర్థం చేసుకోకపోవడం, నిరంతరం విమర్శించడంతో ఇంటికి వెళ్లాలనే ఉత్సాహం చచ్చిపోతోంది. SMలో లోకాన్ని వెతుక్కుంటూ ఇంట్లో వాళ్లకు ముఖం చాటేస్తున్నారు. ఈ ‘అవాయిడెన్స్ కోపింగ్’ వల్ల యువత తమ ఇంటి కంటే బయటి ప్రపంచాన్నే, ఫ్రెండ్స్ గ్రూపులనే తమ అసలైన ఇల్లుగా ఫీలవుతున్నారట.


